జాతీయ వార్తలు

71వ ఏట సోనియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ 71వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. 19 ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహించిన సోనియా తన కుమారుడు రాహుల్ గాంధీకి పగ్గాలు అప్పగించాలని నిర్ణయించుకున్నారు. త్వరలోనే రాహుల్ పట్ట్భాషేకం జరగనుంది. సోనియాకు అనేకమంది ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఓ సందేశంలో సోనియాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యం, సుఖఃసంతోషాలతో జీవించాలని మోదీ ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే, పలువురు సీనియర్ నేతలు, మాజీ మంత్రులు ప్రియతమ నాయకురాలికి శుభాకాంక్షలు తెలిపారు. సోనియా నివాసం టెన్త్ జనపథ్ వెలుపల శనివారం ఉదయం నుంచే సందడి వాతావరణం నెలకొంది. పార్టీ కార్యకర్తలు డ్రమ్ములు వాయిస్తూ నృత్యం చేశారు. సోనియా పోస్టర్లను చేతబూని సంతోషం వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్‌రావత్ టెన్త్ జనపథ్ వద్ద జానపద నృత్యం చేస్తూ హల్‌చల్ చేశారు. మాజీ ముఖ్యమంత్రులు షీలా దీక్షిత్, భూపేందర్ సింగ్ హుడా, మాజీ కేంద్ర మంత్రులు ఆనంద్ శర్మ, జ్యోతిరాదిత్య సింధియా, ఆర్‌పిఎన్ సింగ్, పార్టీ ప్రధాన కార్యదర్శులు జనార్దన్ ద్వివేది, అంబికా సోని, మదన్ ప్రకాశ్ హాజరయ్యారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్, కాంగ్రెస్ గుజరాత్ ఇన్‌చార్జి అశోక్ గెహ్లాట్ సోనియాకు బర్త్‌డే విషెస్ తెలిపారు.

చిత్రం..కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదినోత్సవం సదర్భంగా ఢిల్లీలోని
ఆమె నివాసానికి తరలివస్తున్న కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు