జాతీయ వార్తలు

గుజరాత్ ఎన్నికల్లో పాకిస్తాన్ జోక్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలంపూర్ (గుజరాత్), డిసెంబర్ 10: గత మూడు రోజులుగా గుజరాత్ ఎన్నికల ప్రచారాన్ని ఆసక్తికరమైన రాజకీయ మలుపులు తిప్పుతూ వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో అనూహ్యమైన వాదననే తెరపైకి తెచ్చారు. తనను నీచకులానికి చెందిన వ్యక్తిగా కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ పేర్కొనడాన్ని రాజకీయంగా మలుచుకుని తొలిదశ ఓటింగ్‌ను మలుపుతిప్పిన మోదీ, రెండోదశ పోలింగ్ ప్రచారాన్ని కూడా అదే రీతిలో కీలక మలుపుతిప్పారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పాకిస్తాన్ జోక్యం చేసుకుంటోందని ఆదివారం ఇక్కడ జరిగిన ఓ సభలో మోదీ తీవ్ర ఆరోపణ చేశారు. ఈ పొరుగు దేశానికి చెందిన కొందరు నేతలతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సమావేశమయ్యారని, దీనిపై ఆ పార్టీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మోదీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు అహ్మద్ పటేల్‌ను గుజరాత్ ముఖ్యమంత్రిని చేయాలంటూ పాక్ ఆర్మీ మాజీ డైరెక్టర్ జనరల్ సర్దార్ అర్షత్ రఫిక్ చేసినట్టుగా చెబుతున్న అప్పీల్‌ను మోదీ తెరపైకి తెచ్చారు. నిన్న తనను నీచ కులానికి చెందిన వ్యక్తిగా కాంగ్రెస్ అభివర్ణించిందంటూ ఆ పార్టీపై దుమ్మెత్తిపోసిన మోదీ, ఇప్పుడు పాక్ నేతలతో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సమావేశమయ్యారన్న అంశాన్ని బలమైన రాజకీయ ప్రచార అస్త్రంగా మలచుకున్నారు. మణిశంకర్ అయ్యర్ ఇంట్లో ఈ సమావేశం జరిగినట్టుగా మీడియాలో వార్తలు వచ్చాయని, ఆ భేటీలో పాక్ హై కమిషనర్, ఆ దేశానికి చెందిన విదేశాంగ మంత్రి, భారత మాజీ ఉప రాష్టప్రతి, మాజీ ప్రధాని మన్మోహన్ పాల్గొన్నారని మోదీ ఆరోపించారు. మణిశంకర్ అయ్యర్ ఇంట్లో మూడు గంటలపాటు సమావేశం జరిగిందంటూ మీడియా కథనాలను ఉటంకించారు. ఆ మరునాడే మోదీ నీచుడంటూ మణిశంకర్ అన్నారని, పాక్ నేతలతో కాంగ్రెస్ నేతలు సమావేశం కావడం చాలా తీవ్రమైన అంశమేనని ప్రధాని ధ్వజమెత్తారు. గుజరాత్‌కు కాబోయే ముఖ్యమంత్రిగా అహ్మద్ పటేల్‌కు రఫిక్ మద్దతిచ్చాడని తెలిపారు. దీన్నిబట్టి చూస్తే పాక్ ఆర్మీ మాజీ డైరెక్టర్ జనరల్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జోక్యం చేసుకుంటున్నట్టు కనిపిస్తోందని, అదే క్రమంగా ఆ దేశానికి చెందిన నేతలు మణిశంకర్ అయ్యర్ ఇంట్లోనూ సమావేశం అవుతున్నారని మోదీ తెలిపారు. ఆ సమావేశం తరువాతే ఇటు గుజరాత్ ప్రజలను, రాష్ట్రంలో నివసిస్తున్న వెనుకబడిన వర్గాలను, పేదలను, చివరకు నరేంద్రమోదీనికి కూడా అవమానించే రీతిలో కాంగ్రెస్ నేతలు మాట్లాడారని పేర్కొన్న మోదీ ‘ఒకదాని తరువాత ఒకటిగా జరిగిన ఈ పరిణామలు అనేక సందేహాలను కలిగించడం లేదా?’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై ప్రజలకు జవాబు ఇవ్వాలని, తన ఉద్దేశం ఏమిటో తెలియజేయాలన్నారు. గుజరాత్ రెండో దశ ఎన్నికలు ఉత్తర, మధ్య గుజరాత్‌లో ఈ నెల 14న జరుగుతాయి.

చిత్రం..గుజరాత్‌లోని సనంద్‌లో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఓటర్లకు అభివాదం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ