జాతీయ వార్తలు

రారాజు రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: 125 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో నేటినుంచి రాహుల్ శకం మొదలైంది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి సోమవారం పార్టీ అధ్యక్ష కిరీటం పెట్టారు. కాంగ్రెస్ పదహారవ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని కాంగ్రెస్ ఎన్నికల సంఘం అధ్యక్షుడు ముళ్లపల్లి రామచంద్రన్ ఏఐసిసిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రకటించారు. రాహుల్ ఈనెల 16న ఉదయం 10 గంటలకు అధికారికంగా పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారని ప్రకటించారు. రాహుల్‌గాంధీ తరపున మొత్తం 89నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. ఇతరులెవ్వరూ పోటీకి దిగకపోవటంతో రాహుల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని రామచంద్రన్ వివరించారు. ‘కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల నిర్వహణలో ఎంతమాత్రం జోక్యం చేసుకోలేదు. పార్టీ సంస్థాగత ఎన్నికలు స్వేచ్చాయుత వాతావరణంలో పారదర్శకంగా జరిగాయి’ అని ఆయన ప్రకటించారు. పంతొమ్మిదేళ్లపాటు కాంగ్రెస్‌కు నాయకత్వం వహించిన సోనియాగాంధీ 16న ఉదయం 10 గంటలకు ఏఐసిసి కార్యాలయంలో రాహుల్‌గాంధీకి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారు. వాస్తవానికి రాహుల్ చాలాకాలంగా అనధికార అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. అనారోగ్యం కారణంగా
సోనియా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో, ఆమె బాధ్యతలు రాహులే భుజానికెత్తుకున్నారు. ఇంతవరకు 15మంది కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపడితే, ఇందులో నలుగురు గాంధీ, నెహ్రూ కుటుంబీకులే కావడం గమనార్హం. కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టిన నెహ్రూ కుటుంబీకుల్లో రాహుల్ ఐదో వ్యక్తి. దేశానికి స్వాతంత్రం రాకముందు మోతీలాల్ నెహ్రూ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేశారు. స్వాతంత్రం వచ్చిన తరువాత నెహ్రూ కుటుంబానికి చెందినవారు దాదాపు 38ఏళ్లపాటు కాంగ్రెస్ అద్యక్ష బాధ్యతలు నిర్వర్తించటం గమనార్హం. దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మూడేళ్లపాటు పార్టీ అధ్యక్షుడిగా కొనసాగితే, ఇందిరా గాంధీ ఎనిమిదేళ్లు, రాజీవ్ ఎనిమిదేళ్లపాటు కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో కొనసాగారు. ఇప్పుడు పదవీ విరమణ చేస్తున్న సోనియా గాంధీ పందోమ్మిదేళ్లపాటు కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించటం తెలిసిందే. జాతిపిత మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభ్ భాయి పటేల్, నేతాజీ సుభాష్‌చంద్రబోస్, అబ్దుల్ కలాం ఆజాద్, సరోజినీనాయుడు లాంటి మహామహులు నిర్వహించిన కాంగ్రెస్ అధ్యక్ష పదవిని, ఇప్పుడు రాహుల్ గాంధీ చేపడుతున్నారు.
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ముళ్లపల్లి రామచంద్రన్ ప్రకటించగానే ఏఐసిసి కార్యాలయం వెలుపల ఆనందం వెల్లి విరిసింది. ఏఐసిసి బయట వేచివున్న వందలాది కాంగ్రెస్ కార్యకర్తలు బాణసంచా పేల్చి అనందం పంచుకున్నారు. మహిళా కార్యకర్తలు రంగులు చల్లుకుంటూ బాజా భజంత్రీల మధ్య ఆనందంతో నృత్యాలు చేశారు. పలువురు కార్యకర్తలు స్వీట్లుపంచుతూ తమ సంతోషం వ్యక్తం చేశారు.
వారసత్వ రాజకీయాల్లో భాగంగా కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపడుతున్న రాహుల్‌గాంధీ, తన తల్లికంటే ఎక్కువ కాలం అధ్యక్షుడిగా కొనసాగుతారని పార్టీ వర్గాలు అంటున్నాయి. సోనియా 1998లో పార్టీ అధ్యక్ష పదవి చేపట్టినప్పుడు, కాంగ్రెస్ కేవలం నాలుగు రాష్ట్రాలు.. మధ్యప్రదేశ్, ఓడిశా, నాగాలాండ్ , మిజోరంలో మాత్రమే అధికారంలో ఉంది. అంతకుముందు అధ్యక్ష పదవిని నిర్వహించిన సీతారాం కేసరి అనుసరించిన బాధ్యతారహిత రాజకీయాల కారణంగా కాంగ్రెస్ అత్యంత దయనీయ పరిస్థితులకు చేరిన సమయంలో సోనియా అధ్యక్ష పదవి చేపట్టారు. కేవలం ఆరేళ్లలోనే పార్టీ దశ, దిశను మార్చేశారు. సోనియా నాయకత్వంలోని కాంగ్రెస్ పదేళ్లపాటు కేంద్రంలో అధికారం చెలాయించింది. ఇప్పుడు రాహుల్ అధ్యక్ష పదవి చేపడుతున్న సమయంలో కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. ఈ గడ్డు పరిస్థితుల్లో అధ్యక్ష పదవి చేపడుతున్న రాహుల్, కాంగ్రెస్‌కు గత వైభవాన్ని సాధించిపెట్టగలరా? అన్న ఆసక్తి దేశంలో కనిపిస్తోంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలోకి వస్తే రాహుల్ రాజకీయ పలుకుబడి పెరిగినట్టేనని కొందరు అంటున్నారు. గుజరాత్‌లో అధికారంలోకి రాకున్నా, గతంలోకంటే ఎక్కువ సీట్లు గెలుచుకున్నా రాహుల్ పరువు దక్కుతుంది. దీనికి భిన్నంగా జరిగేపక్షంలో రాహుల్ నాయకత్వం ప్రశ్నార్థకం కావొచ్చు. రాహుల్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టటాన్ని పలువురు సీనియర్లు జీర్ణించుకోలేక పోతున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే, పార్టీ సీనియర్లు సైతం రాహుల్ నాయకత్వానికి తలొంచక తప్పదు.
రాహుల్ ఎన్నికలో రిగ్గింగ్
రాహుల్‌ని పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకునేందుకు జరిగిన ఎన్నికలో ఎన్నో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ నాయకుడు షహజాదా పూనేవాలా ఆరోపించారు. ‘ఇప్పుడు ఎన్నికన్నదే జరగలేదు. రాహుల్‌ను పార్టీ చీఫ్‌గా ఎన్నుకోవాలనేది ముందే నిర్ణయమైపోయిన విషయం. కాంగ్రెస్ చరిత్రలో ఇదొక బ్లాక్ డే’ అని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ గాంధీ కుటుంబ ఆస్తి అన్న చందాన వ్యవహరించారని, అందుకే ఏస్థాయిలోనూ కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికలు స్వేచ్చ, పారదర్శకతతో జరగలేదని పూనేవాలా దుయ్యబట్టారు.
*
రాహుల్ శకమిక మొదలై
అహమును విడనాడి నేతలందరునొకటై
కాహళి నూదెదమంటూ
అహరహము పరిశ్రమించ అందలమందున్!