జాతీయ వార్తలు

జార్ఖండ్ మాజీ సీఎం మధుకొడా దోషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణంలో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కొడా, బొగ్గు గనులశాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తా సహా మరో ఆరుగురిని సిబిఐ ప్రత్యేక కోర్టు దోషులుగా గుర్తించింది. వీరంతా అవినీతికి పాల్పడినట్లు కోర్టు బుధవారం నాడు ప్రకటించింది. వీరికి గురువారం శిక్షలను ఖరారు చేయనున్నట్లు ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. కాగా, బొగ్గు కుంభకోణం కేసులో నిందితులైన మరో నలుగురిని నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. ఈ కేసులో మధుకొడా, హెచ్‌సీ గుప్తాలతో పాటు ఝార్ఖండ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఏకె బసు, మరికొందరు అధికారులు ‘విని ఐరన్ అండ్ స్టీల్స్ ఉద్యోగ్ లిమిటెడ్’ (విసుల్)కు అనుకూలంగా వ్యవహరించి అవినీతికి పాల్పడినట్లు సిబీఐ న్యాయమూర్తి భరత్ పరాశర్ నిర్థారించారు. జార్ఖండ్‌లోని రాజ్‌హర బొగ్గు గనిని కోల్‌కతకు చెందిన ‘విసుల్’ కంపెనీకి కేటాయించడంలో అక్రమాలు జరిగాయన్న నేరారోపణలపై సిబిఐ కోర్టు విచారించింది. ఈ కేసులో ‘విసుల్’ డైరెక్టర్ వైభవ్ తుల్స్‌యాన్, ప్రభుత్వ ఉద్యోగులు బసంత్‌కుమార్ భట్టాచార్య, నవీన్‌కుమార్ తుల్స్‌యాన్‌లను కోర్టు నిర్దోషులుగా గుర్తించింది.
నిందితులందరిపైనా నేరపూరిత కుట్ర, మోసం వంటి ఇతర అభియోగాలు భారత శిక్షాస్మృతి, అవినీతి నిరోధక చట్టం కింద దాఖలయయ్యాయి. 2007 జనవరిలో బొగ్గు గనుల కేటాయింపును పారదర్శకంగా నిర్వహించలేదని, ఫలితంగా వేలాది కోట్ల రూపాయల మేరకు అక్రమాలు జరిగాయని కేసు నమోదైంది. ‘విసుల్’ కంపెనీకి బొగ్గు గనులు కేటాయించాలని జార్ఖండ్ ప్రభుత్వం గాని, ఉక్కు మంత్రిత్వ శాఖగాని సిఫారసు చేయలేదు. అయితే, ఓ స్క్రీనింగ్ కమిటీ మాత్రం ‘విసుల్’కు అనుకూలంగా వ్యవహరించింది. అప్పటి బొగ్గు శాఖ కార్యదర్శి హెచ్‌సీ గుప్తా ఆ స్క్రీనింగ్ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించి కథను నడిపించారు. మధు కొడాతో పాటు సీనియర్ అధికారులు గుప్తా, బసు బొగ్గు గనుల కేటాయింపులో కీలకపాత్ర వహించారు.