జాతీయ వార్తలు

వన్ మేన్ షో.. చాలిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: ‘వన్ మేన్ షో, టు మెన్ ఆర్మీ’కి విజ్ఞప్తి. ఇక ఎన్నికల ప్రచారం ముగించి ఢిల్లీకి చేరుకుంటే మంచిది. అధికారం కోసం మీరు పన్నిన మాయోపాయాలు, తంత్రాలు, తప్పుడు ప్రకటనలు, నెరవేర్చలేని హామీలతో ఇప్పటికే విసిగిపోయాం’ అంటూ నరేంద్ర మోదీ, అమిత్ షాను ఉద్దేశించి నటుడు, బీజేపీ నాయకుడు శతృఘ్న సిన్హా తన మాటల తుపాకీని పేల్చారు. ‘వన్ మేన్ షో (మోదీ), టు మెన్ ఆర్మీ (అమిత్ షా)కు అత్యంత మర్యాద పూర్వకమైన విజ్ఞప్తి. ఇకనైనా ఢిల్లీకి చేరుకోండి. మీ ఎన్నికల ప్రచారాలతో విసిగిపోయాం. గుజరాత్‌లో విజయం కోసం అక్కడున్న మంత్రులు, సిట్టింగులు వాళ్ల తిప్పలేవో వాళ్లు పడతారు’ అంటూ శతృఘ్న సిన్హా బుధవారం చిత్రమైన ట్వీట్ చేశారు. ‘ఒకవేళ మనం గెలిస్తే, ఆ క్రెడిట్ అంతా మీకు దక్కుతుంది. పొరబాటున ఒడిపోతే.. దానికి బాధ్యత తీసుకునే వాళ్లు ఎవరు?’ అంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంలో ఓ పాత సామెతను గుర్తు చేస్తూ ‘అదృష్టం బావుంటే చప్పట్లు మనవే అవుతాయి’ అని ట్వీట్‌లో కోట్ చేశారు. పార్టీలో శతృఘ్న ప్రాధాన్యత తగ్గినప్పటి నుంచీ, బీజేపీ నాయకత్వంపై సోషల్ మీడియా వేదికగా విరుచుకు పడుతున్న విషయం తెలిసిందే. సుదీర్ఘకాలం పాటు ఏలుబడి సాగించిన గుజరాత్‌లో పార్టీ అననుకూల పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో, నరేంద్ర మోదీ, అమిత్ షాలు అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృత ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. మంగళవారం సాయంత్రానికి రెండో విడత ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. మలిదశలో భాగంగా 93 అసెంబ్లీ స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. గుజరాత్ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ డిసెంబర్ 18న నిర్వహిస్తారు. 1995 నుంచీ నిరంతరంగా బీజేపీ గుజరాత్‌లో అధికారంలో ఉన్న విషయం తెలిసిందే.