జాతీయ వార్తలు

రామసేతువు మానవనిర్మితమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: పౌరాణిక ప్రాధాన్యత కలిగిన రామసేతు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. భారత్-శ్రీలంకల మధ్యనున్న ఈ వారధి మానవ నిర్మితమేనని, ప్రకృతి సహజంగా ఏర్పడినది కాదని అమెరికాకు చెందిన ఓ సైన్స్ చానెల్ నిగ్గుతేల్చింది. ఏళ్ల తరబడి జరిపిన పరిశోధనల అనంతరం రామసేతువు మానవ నిర్మితమేనని, ఏడువేల సంవత్సరాల క్రితమే తమిళనాడులోని రామేశ్వరం నుంచి శ్రీలంకలోని మన్నార్ వరకూ సేతువు నిర్మాణం జరిగిందని, రాళ్లతోనే దీన్ని నిర్మించారని వెల్లడించింది. రామసేతువు సహజ సిద్ధంగా ఏర్పడిందా? లేక మానవ నిర్మితమా? అన్న దానిపై దేశంలో దీర్ఘకాలంగా వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో అమెరికా సైన్స్ చానల్ వెల్లడించిన వివరాలు మరింత ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. తన భార్య సీతను రావుణుడి బారినుంచి విడిపించడానికి వానరుల సాయంతో శ్రీరాముడు రామేశ్వరం నుంచి శ్రీలంకకు రామసేతువు నిర్మించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. అయితే ఇది ఎంతైనా వాస్తవమని, రాళ్లతోనే దీన్ని ఆనాటి కాలంలో నిర్మించినట్టుగా శాస్తప్రరిశోధనలోనూ నిగ్గు తేలడం గమనార్హం. గతంలో కూడా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఇదే విషయాన్ని ధ్రువీకరించింది. రామసేతు మానవ నిర్మితమేనంటూ స్పష్టమైన
సంకేతాలను అందించిన విషయం తెలిసిందే. అమెరికా సంస్థ దీనికి ఆడమ్స్ బ్రిడ్జిగా పేర్కొంటున్నప్పటికీ, ఇది మన పురాణ కాలంనాటి రామసేతువేనన్నది భారతీయుల నమ్మకం, విశ్వాసం. ఈ సేతువుకు సంబంధించి ఒక ప్రొమోను కూడా అమెరికా సైన్స్ చానెల్ విడుదల చేసింది. ఈ సేతువు మట్టిరాళ్లతో నిర్మితమైందని, పురాతత్వ వివరాలను ఉటంకిస్తూ వెల్లడించింది. ఇది కచ్చితంగా మానవులే నిర్మించారని చెప్పడానికి దాని నిర్మాణ స్వరూపమే కారణమని కూడా వెల్లడించింది. అమెరికా చానెల్ వివరాలను అందిపుచ్చుకున్న బీజేపీ, రామసేతుపై తమ వాదన నెగ్గిందని స్పష్టం చేసింది. శ్రీరాముడు ఉన్నాడని, ఆయన కాలంలోనే ఈ రామసేతువు నిర్మాణం జరిగిందన్న తమ అభిప్రాయానికీ, నమ్మకానికీ అమెరికా చానెల్ వివరాలు మరింత పునాధిని వేశాయని బీజేపీ పేర్కొంది. హిందూమతం విషయంలో మొదటినుంచీ కూడా కాంగ్రెస్ పార్టీకి సందేహాత్మకంగానే వ్యవహరిస్తూ వస్తోందని, ఈ తాజా వెల్లడితో రామసేతువు నిజమేనని తెలిపోయిందని, ఇది మానవ నిర్మితమేనన్న వాస్తవమూ నిగ్గుతేలిందని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ఢిల్లీలో జరిపిన విలేఖర్ల సమావేశంలో తెలిపారు. మన పురాణ కాలంనాటి ఈ రామసేతువును పరిరక్షించుకోవాలని, దాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేయకూడదని తెలిపారు. మరో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా రామసేతువు విషయంలో నాటి యూపీఏ వాదనను తప్పుబట్టారు. రామయంలో పేర్కొన్నట్టుగా లంక నుంచి సీతను రక్షించడానికే రామేశ్వరం నుంచి ఈ సేతువు నిర్మించారన్న హిందువుల వాదనను ప్రశ్నిస్తూ అప్పట్లో సుప్రీం కోర్టులో యూపీఏ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిందని గుర్తు చేశారు. నాడు రామసేతువు ఉనికిని ప్రశ్నించిన వ్యక్తులు తాజా నిర్థారణ నేపథ్యంలో ప్రజలకు వివరణ ఇచ్చుకోవాలని రవిశంకర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. 2007-08 ప్రాంతంలో నాటి యూపీఏ సర్కార్ సేతు సముద్రం షిప్పింగ్ చానెల్‌ను నిర్మించాలని సంకల్పించింది. దాని కారణంగానే భారత్-శ్రీలంకల మధ్య ఏరకమైన వంతెన లేదని సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఒకవేళ రాముడు దీన్ని నిర్మించివుంటే దాని తరువాత ఆయనే ధ్వంసం చేసి ఉండాలని తెలిపింది. అంతేకాదు, అది ప్రకృతి సిద్ధంగా ఏర్పడిందే తప్ప, ఈ వంతెన ఎంతమాత్రం సూపర్‌మ్యాన్ నిర్మించింది కాదనీ వెల్లడించింది. సేతు సముద్రం ప్రాజెక్టు వల్ల రామసేతువుకు భంగం కలుగుతుందన్న ఉద్దేశంతో ఈ ఆలోచనపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. దాదాపు 83 కిలోమీటర్ల పొడవైన ఈ సముద్ర మార్గాన్ని నిర్మించాలంటే సున్నపు రాళ్లతో నిర్మించిన రామసేతువునూ ధ్వంసం చేయాల్సి ఉండటమే ఈ వ్యతిరేకతకు కారణం.