జాతీయ వార్తలు

‘ఈశాన్యం’లో అభివృద్ధికి దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐజ్వాల్/షిల్లాంగ్, డిసెంబర్ 16: ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధిని వేగవంతం చేసేందుకు తమ ప్రభుత్వం దృఢ దీక్షతో కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’లో భాగంగా ఈశాన్య ప్రాంతాల ప్రగతికి దృష్టి సారించామన్నారు. మిజోరం, మేఘాలయ రాష్ట్రాల్లో పలు రహదారులు, విద్యుత్ ప్రాజెక్టులను శనివారం ఆయన ప్రారంభించారు. మిజోరంలో 60 మెగావాట్ల త్యురైల్ జలవిద్యుత్ ప్రాజెక్టును ఆయన జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల సిక్కిం, త్రిపుర తర్వాత ఈశాన్యంలో మిగులు విద్యుత్ రాష్ట్రాల జాబితాలో మిజోరం స్థానం దక్కించుకుంది. 1998లో అప్పటి ప్రధాని వాజపేయి ఈ విద్యుత్ ప్రాజెక్టుకు అనుమతి మంజూరు చేయగా, ఇప్పటికి తన హయాంలో ప్రారంభం కావడం ఆనందంగా ఉందని మోదీ అన్నారు. మిజోరంలో జలవిద్యుత్ ప్రాజెక్టు వద్ద నిర్మించిన డ్యామ్ వల్ల మారుమూల గ్రామాలకు రహదారి సౌకర్యం, పర్యాటకం, మత్స్య పరిశ్రమ అభివృద్ధి చెందుతాయన్నారు. మేఘాలయ పర్యటనలో ఆయన మాట్లాడుతూ, ఈశాన్య రాష్ట్రాల్లో గ్రామీణ, జాతీయ రహదారులను అభివృద్ధి చేసేందుకు 90,000 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. పశ్చిమ మేఘాలయలోని తుర నుంచి షిల్లాంగ్ వరకూ నిర్మించిన 271కిలోమీటర్ల రహదారిని ఆయన ప్రారంభించారు.
తమ ప్రభుత్వం చేపట్టిన ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’ కింద మిజోరంను సౌత్‌ఈస్ట్ ఆసియా దేశాలకు ముఖద్వారంగా మారుతుందన్నారు. కంబోడియా, వియత్నాం, మయన్మార్ ప్రాంతాలకు మిజోరం ప్రధాన ఆకర్షణగా మారుతుందన్నారు. మిజోరం- మయన్మార్ రహదారి వాణిజ్య రంగం ప్రగతికి దోహదం చేస్తుందన్నారు. తమ ప్రభుత్వం వివిధ పథకాల కింద ఈశాన్య రాష్ట్రాలకు ఇస్తున్న కేటాయింపుల వివరాలను మోదీ తెలిపారు.

చిత్రం..షిల్లాంగ్‌లో శనివారం నిర్వహించిన ‘ర్యాలీ ఫర్ చేంజ్’ సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ తదితరులు