జాతీయ వార్తలు

తీర ప్రాంత భద్రతకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 6: తీరప్రాంత భద్రతపై కేంద్రం దృష్టిసారించింది. ఉగ్రవాదుల దాడులను నుంచి తీరప్రాంతాన్ని పరిరక్షించాలన్న ఉద్దేశంతో ఈ నెల 16న ముంబయిలో ముఖ్యమంత్రుల సమాశం ఏర్పాటు చేశారు. కోస్తా తీరం వెంబడి ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశానికి హాజరవుతారని ఓ అధికార ప్రకటనలో తెలిపారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ కీలక సమావేశం జరగనుంది. దేశంలో 7,517 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న తీర ప్రాంతంలో 12 మేజర్ పోర్టులు, 187 చిన్న, మధ్యతరగతి పోర్టులు ఉన్నాయి. తీర ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంత సిఎంలకు ఈ మేరకు హోంశాఖ ఆహ్వానాలు పంపింది. ‘కోస్తా ప్రాంతంలో భద్రత పటిష్టం చేయాలని నిర్ణయించాం. తొమ్మిది రాష్ట్రాల సిఎంలు, నాలుగు కేంద్ర పాలిత రాష్ట్రాల సిఎంలు ముంబయి సమావేశానికి వస్తారు’ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు.