జాతీయ వార్తలు

వాజపేయికి శుభాకాంక్షల వెల్లువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి జన్మదిన వేడుకలు సోమవారం దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సుపరిపాలన దినోత్సవం జరుపుకున్నారు. ప్రభుత్వ పాలనలో జవాబుదారీతనం కల్పించడంలో కీలకపాత్ర పోషించినందుకు వాజపేయి జన్మదినాన్ని 2014 నుంచి మోదీ ప్రభుత్వం ‘సుపరిపాలన దినం’గా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. జన్మదినం సందర్భంగా వాజపేయి ఇంటికి వెళ్లి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
అంతకుముందు వాజపేయికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని ట్వీట్ చేశారు. ‘మా ప్రియమైన నేతకు జన్మదిన శుభాకాంక్షలు, మీ దార్శనిక న్యాయకత్వంలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది, మీరు పరిపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని భగవంతుడిని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు. అలాగే, రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్ర పతి వెంకయ్యనాయుడు, పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తదితరులు వాజపేయికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానితోపాటు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రి విజయ్ గోయల్ వాజపేయిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
సుపరిపాలనతో సమగ్రాభివృద్ధి: మోదీ
నోయిడా: సమగ్రాభివృద్ధిని సాధించడంలో సుపరిపాలన కీలకపాత్ర వహిస్తుందని, వ్యక్తిగత లాభాలను ఆశించే వైఖరికి ప్రజలు స్వస్తి పలికినపుడు ప్రభుత్వ పథకాలు విజయవంతం అవుతాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీ మెట్రోరైల్ ప్రాజెక్టులో మెజెంటా లైన్‌ను సోమవారం ప్రారంభించిన సందర్భంగా మోదీ మాట్లాడారు. ఆశించినంత స్థాయిలో పాలన లేనపుడు ప్రజలకు ఎలాంటి మేలు జరగదని, ఈ పద్ధతిని మార్చాలన్నదే తన ధ్యేయమన్నారు. విధానాలు మారినపుడే ప్రజలకు మంచి జరుగుతుందని మోదీ అన్నారు. తాను అధికారం చేపట్టినపుడు- ‘ప్రభుత్వాధికారులు సమయానికి కార్యాలయాలకు వస్తున్నారని, ఉద్యోగులు మరింత జవాబుదారీతనంతో పనిచేస్తున్నారని పత్రికలు విశేష ప్రాధాన్యత కల్పించి వార్తలు రాసేవి’ అని మోదీ గుర్తు చేశారు.
యుపిలో 93మంది ఖైదీలకు విముక్తి
లక్నో: వాజపేయి 93వ జన్మదినం సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లో 93మంది ఖైదీలకు విముక్తి లభించింది. శిక్షాకాలం పూర్తయినా ఇంకా జైలులోనే మగ్గుతున్న 93మంది ఖైదీలు సోమవారం బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టారు. వివిధ కేసుల్లో శిక్షాకాలం పూర్తిచేసుకున్నా జరిమానా కట్టలేక జైలులోనే కాలం గడుపుతున్న ఖైదీలను వాజపేయి జన్మదినం సందర్భంగా విడుదల చేయాలని గతంలోనే నిర్ణయించామని రాష్ట్ర హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్‌కుమార్ వెల్లడించారు. శిక్షాకాలం పూర్తయిన ఖైదీలు 135మంది ఉన్నారని, వరుస క్రమంలో 93మందిని విడుదల చేసినట్లు తెలిపారు.

చిత్రాలు..అటల్ బిహారీ వాజపేయికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు
ఆయన ఇంటికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్
*వాజపేయి జన్మదినోత్సవం సందర్భంగా సోమవారం మధురైలోని
తన నివాసంలో కేకును కోస్తున్న బీజేపీ ఎంపీ హేమామాలిని