జాతీయ వార్తలు

గుజరాత్ గద్దెపై రూపానీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంధీనగర్, డిసెంబర్ 26: గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో సీఎం గద్దెనెక్కే అవకాశం రూపానీకి రెండోసారి లభించింది.
ఉప ముఖ్యమంత్రిగా నితిన్ పటేల్, మంత్రులుగా 18మంది ప్రమాణ స్వీకారం చేశారు. గుజరాత్‌లో గతంకంటే మెజారిటీ తగ్గడంతో ఈసారి రూపానీకి అవకాశం ఉండకపోవచ్చన్న అంచనాలు తొలుత వెలువడ్డాయి. అయితే 22న బీజేపీ అసెంబ్లీపక్ష నేతగా విజయ్‌రూపానీ ఎంపిక కావడంతో సీఎం పదవికి ఆయనకు క్లియరెన్స్ దక్కింది. ఇదిలావుంటే సోమవారం కొత్త మంత్రివర్గం చేత గవర్నర్ ఒపి కోహిల్ ప్రదవీ ప్రమాణం, గోప్యతా ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, బీజేపీపాలిత రాష్ట్రాల సీఎంల సమక్షంలో రూపానీ పదవీ ప్రమాణం చేశారు. సచివాలయానికి సమీపంలోని గవర్నర్ నివాసంలో జరిగిన కార్యక్రమంలో రూపానీతోపాటు ఉప ముఖ్యమంత్రిగా నితిన్ పటేల్, తొమ్మిదిమంది కేబినెట్ మంత్రులు, పదిమంది సహాయ మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్డీయే సారథ్యంలోని అధికారపక్ష సీఎంలు, పార్టీ ముఖ్యులనుంచి ఆశీర్వాదం తీసుకున్న అనంతరం వేదిక వద్దకు కాషాయ దుస్తుల్లో రూపానీ, నితిన్ పటేల్ ఉత్సాహంగా చేరుకున్నారు. ప్రమాణ స్వీకారానికి ముందు భార్యతో కలిసి విజయ్ రూపానీ పంచదేవ్ మహాదేవ్ ఆలయంలో పూజలు నిర్వహించారు. పెద్దఎత్తున జరిగిన కార్యక్రమానికి పార్టీ, ప్రభుత్వ దిగ్గజాలు ఎల్‌కె అద్వానీ, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీహార్, యూపీ, మహారాష్ట్ర సీఎంలు నితీష్‌కుమార్, యోగి ఆదిత్యనాథ్, దేవేంద్ర ఫడ్నవీస్‌లు హాజరయ్యారు. కేబినెట్ మంత్రులుగా భూపేంద్రసిన్హ్ చుడాసమ, ఆర్‌సి ఫాల్దు, కిశిక్ పటేల్, సౌరభ్ పటేల్, గణపతిసిన్హ్ వాసవ, జయేష్ రాడాడియో, దిలీప్ ఠాకూర్, ఈశ్వర్ పార్మార్ ప్రమాణ స్వీకారం చేశారు. సహాయ మంత్రులుగా ప్రదీప్‌సిన్హ్ జడేజా, పర్బాత్ పటేల్, జైద్రత్‌సిన్స్ పర్మార్, రామన్ పట్కార్, పరుషోత్తం సోలంకి, ఈశ్వర్‌సిన్హ్ పటేల్, వాసన్ అహిర్, కిషోర్ కనాని, బాచుభాయ్ కబాద్, వైభవరిబెన్ దేవ్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేసిన తొమ్మిది మందిలో ఐదుగురు పాతవారే ఉంటే, పదిమంది సహాయమంత్రుల్లోనూ ఐదుగురు పాతవారే ఉన్నారు. కేబినెట్‌లో పటేల్ వర్గీయులకు ఆరుగురికి స్థానం దక్కితే, మహిళా కోటాలో భావనగర్ ఈస్ట్ ఎమ్మెల్యే వైభవరిబెన్ దేవ్ ఒక్కరికే చాన్స్ దొరికింది.

చిత్రం..గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయరూపానీ ప్రమాణ స్వీకారానికి
హాజరైన ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా