జాతీయ వార్తలు

పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో జోక్యం చేసుకొని, త్వరగా పూర్తి చేయాలని ప్రధాని నరేంద్రమోదీకి సీపీఐ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శుక్రవారం ఆ పార్టీ నాయకులు డి.రాజా, కె.నారాయణలు పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏర్పడిన భేషజాలను తొలగించి ప్రాజెక్టు నిర్మాణానికి సహకారం అందించాలని ప్రధానికి సీపీఐ నాయకులు విజ్ఞప్తి చేశారు. అనంతరం సీపీఐ నేత నారాయణ విలేఖరులతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ అస్పష్టమైన వైఖరి వలన ప్రాజెక్టు నిర్మాణం సమస్యలలో చిక్కుకుందని, ఈ ఇబ్బందుల పరిష్కారం కోసం ప్రధాని జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. అలాగే ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం కల్పించేందుకు రూ.33 వేల కోట్లు అవసరమవుతాయని, ఇప్పటి వరకు కేంద్రం రూ.7 వేల కోట్లు మాత్రమే విడుదల చేసిందని వెల్లడించారు. ఈ ప్రాజక్టుకు అవసరమైన పూర్తి నిధులను విడుదల చేయడంతో పాటు నిర్వాసితులు సమస్యలను పరిష్కరించేందకు ఒక ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయాలని ప్రధానిని కోరినట్టు తెలిపారు. అలాగే రాష్ట్రాల హక్కులను సాధించుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా విఫలం అయ్యారని విమర్శించారు. ముఖ్యమంత్రి ఏదో తప్పు చేశారు కనుకనే ప్రధాని నరేంద్రమోదీ ఆయనకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని చెప్పారు. ప్రధానిని కలిసిన సీపీఐ నాయకులతో పాటు పెంటపాటి పుల్లారావు కూడా ఉన్నారు.