జాతీయ వార్తలు

చిత్తశుద్ధివుంటే పోరాటం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: ఎస్సీ వర్గీకరణపై మందకృష్ణ మాదిగకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రం ప్రభుత్వంపై పోరాటం చేయాలి కాని, రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన కక్ష సాధింపు ఏమిటని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి ప్రశ్నించారు. ఢిల్లీలో శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఈ మేరకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మందకృష్ణ బీజేపీ తొత్తుగా వ్యవహారిస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. మాదిగ సామాజిక వర్గం అభివృద్ధికి అన్ని విధాలుగా కృషిచేస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై అనవసరంగా మందకృష్ణ విమర్శలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
ఎస్సీ వర్గీకరణ బిల్లు
పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలి

న్యూఢిల్లీ, డిసెంబరు 29: ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాలలో కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితులు జంతర్‌మంతర్‌లో ధర్నా నిర్వహించాయి. శుక్రవారం ఏపీ, తెలంగాణ ఎమ్మార్పీఎస్‌ల ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. సుప్రీంకోర్టు తీర్పు కాదని ఇప్పటికే పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో ఎస్సీ వర్గీకరణ అమలుచేస్తున్నారని, ఎస్సీ వర్గీరణపై కేంద్రం బిల్లును తీసుకురాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఏపీ నుంచి ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ, తెలంగాణ నుంచి గడ్డం యాదయ్య మాదిగ నేతృత్వంలో ఈ ధర్నా జరిగింది.