జాతీయ వార్తలు

బహుభార్యత్వాన్నీ నిషేధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: ట్రిపుల్ తలాక్‌ను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఓ కీలక బిల్లును లోక్‌సభలో ఆమోదించిన నేపథ్యంలో ముస్లిం పురుషుల్లో ప్రబలంగా ఉన్న బహు భార్యత్వాన్ని కూడా నిషేధించాలన్న డిమాండ్లు తీవ్రమవుతున్నాయి. బహు భారత్వమన్నది ట్రిపుల్ తలాక్ కంటే కూడా ఘోరమైనదని ముస్లిం మహిళలు అంటున్నారు. ట్రిపుల్ తలాక్‌తో పాటే బహు భార్యత్వాన్ని కూడా కేంద్రం రద్దు చేసి ఉండాల్సిందన్న బలమైన అభిప్రాయాన్ని మహిళలు వ్యక్తం చేశారు. ట్రిపుల్ తలాక్ రద్దు బిల్లుతో ముస్లిం మహిళలకు సరికొత్త న్యాయ శకం మొదలైందని, అయితే దీనితో పాటు బహు భారత్వాన్ని కూడా రద్దు చేసి ఉంటే బావుండేదని ట్రిపుల్ తలాక్‌పై దీర్ఘకాల పోరాటం చేసిన ఈ మహిళలు స్పష్టం చేశారు. అయితే ట్రిపుల్ తలాక్ రద్దు బిల్లుతో ఈ దిశగా బలమైన అడుగు పడిందని న్యాయవాదులు ఫరా ఫియాజ్, రిజ్వానా, రజియాలు స్పష్టం చేశారు. 1985లో షాబానో కేసు సమయంలో కూడా అప్పటి కేంద్ర ప్రభుత్వానికి ఇలాంటి అవకాశం వచ్చిందని వారు గుర్తు చేశారు.