జాతీయ వార్తలు

కాలిబూడిదైపోయారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 29: ముంబయిలో గురువారం రాత్రి పొద్దుపోయిన తరువాత జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 14మంది సజీవదహనమయ్యారు. ఓ ఇంటిపైకప్పుపై పుట్టిన రోజు వేడుక జరుపుకుంటున్న సమయంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. మరణించిన వాళ్లలో దాదాపు ఎక్కువ మహిళలే ఉన్నారని అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ సంఘటనల్లో 21మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. ముందుగా వన్ అబౌవ్ పబ్ టెర్రస్‌పై మంటలు రాజుకున్నాయని, అనంతరం మూడో ఫ్లోర్‌లోవున్న మోజో పబ్‌కూ వ్యాపించాయని, క్రమంగా దిగువకూ మంటలు చేరుకున్నాయని అధికారులు వెల్లడించారు. మరణించిన వారిలో చాలామంది ఊపిరాడక కన్ను మూసినట్టు కెఇఎం ఆస్పత్రి డీన్ అవినాశ్ సూపె తెలిపారు. ఓ మహిళ తన పుట్టిన రోజు వేడుకలో భాగంగా ఈ భవన టెర్రస్‌పై పార్టీ ఏర్పాటు చేసిందని, ఆ సమయంలోనే అగ్ని ప్రమాదం జరిగినట్టు వెల్లడించారు. ఘోర ప్రమాదం సంభవించి 14మంది కాలిబూడిదైన సంఘటనతో ప్రధాని నరేంద్ర మోదీ దిగ్బ్రాంతికి గురయ్యారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.
దోషుల్ని శిక్షించాల్సిందే: రాహుల్
ముంబయి పబ్ టెర్రేస్‌పై జరిగిన ఘోర అగ్నిప్రమాదానికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు. మరాఠీలో తొలిసారిగా ట్వీట్ చేసిన ఆయన ఈ దుర్ఘటనను అత్యంత దురదృష్టకరమైనదిగా అభివర్ణించారు. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు.

చిత్రాలు..పూర్తిగా తగులబడిన భవంతి (ఏరియల్ వ్యూ)