జాతీయ వార్తలు

ఏకకాలంలో కక్ష్యలోకి 31 ఉపగ్రహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, డిసెంబర్ 29: అంతరిక్ష పరిశోధనల్లో ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్న ఇస్రో మరో అద్భుత ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. పోలార్ రాకెట్ ద్వారా వచ్చే నెల 10న కార్టోశాట్ సిరీస్‌తోపాటు 31 ఉపగ్రహాలను ఏకకాలంలో ప్రయోగించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ ఏడాది ఆగస్టులో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1హెచ్ విఫలమైన నేపథ్యంలోఈ తాజా ప్రయోగాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామని, తాత్కాలికంగా జనవరి 10న ఈ ప్రయోగాన్ని చేపట్టాలని నిర్ణయించినట్టు ఇస్రో సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే, వీటిలో ప్రధానంగా కార్టోశాట్ -2 సిరీస్ ఉపగ్రహమే ఎక్కువ బరువుంటుందని వెల్లడించారు. ఇందుకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునేందుకు మిషన్ రెడీనెస్ రివ్యూ కమిటీ రానున్న 2, 3 రోజుల్లోసుమావేశం అవుతుందని తెలిపారు. ఈ ప్రయోగం కోసం పిఎస్‌ఎల్‌వి-సి40 రాకెట్ ఉపయోగిస్తామని, ఇందులో ఇతర దేశాలకు చెందిన 28 నానో ఉపగ్రహాలు ఉంటాయని తెలిపారు. ఫిన్‌లాండ్, అమెరికా కూడా తమ నానో ఉపగ్రహాల ద్వారా ఈ ప్రయోగంలో భాగం పంచుకుంటున్నాయని అన్నారు. ఈ ఏడాది ఆగస్టు 31న చేపట్టిన పిఎస్‌ఎల్‌వి ప్రయోగం సాంకేతిక కారణాల దృష్ట్యా విఫలమైన విషయం తెలిసిందే. రాకెట్‌నుంచి ఉపగ్రహాలు విడిపోయే సమయంలో హీట్‌షీల్డ్ పనిచేయకపోవడంవల్లే ఈ ప్రమాదం జరిగిందని, రాకెట్ నాలుగో దశలోనే ఇది చోటుచేసుకుందని ఇస్రో నిర్థారించింది. కార్టోశాట్ సిరీస్‌లో ఇస్రో చేయబోతున్న ఈ ప్రయోగం 3వది.