జాతీయ వార్తలు

ప్రభుత్వ పతనం ఖాయం: దినకరన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 29: రాష్ట్రంలోని పళనిస్వామి ప్రభుత్వం మరో మూడు నాలుగు నెలల్లో దిగిపోవడం ఖాయమని అన్నాడిఎంకె శశికళ వర్గం నాయకుడు దినకరన్ అన్నారు. ఇటీవల ఆర్.కె.నగర్ అసెంబ్లీ ఉపఎన్నికలో ఘనవిజయం సాధించిన ఆయన ఎమ్మెల్యేగా శుక్రవారం పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఆయన మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు. ఇప్పటివరకు చేసిన తప్పిదాలకు ప్రాయశ్చిత్తంగా అధికార కూటమిలోని ఐదారుగురు ప్రధాన వ్యక్తులు తమ పదవులనుంచి దిగిపోవాలని మళ్లీ రాష్ట్రంలో అమ్మ పాలన రావడానికి మార్గం సుగమం చేయాలని ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ దినకరన్ అన్నారు. మూడు నాలుగు నెలల్లోనే తమ ప్రభుత్వం పడిపోతుందన్న దినకరన్ జోస్యాన్ని అధికార కూటమి కొట్టిపారేసింది. కలలు కనేవారి ఆంక్షలకు తాను జవాబు చెప్పలేనని ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వ్యాఖ్యానించారు.

చిత్రం..ఆర్‌కె నగర్ ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరిస్తున్న టీటీవీ దినకరన్