జాతీయ వార్తలు

‘ఐ బెగ్ టూ’ ఉపయోగించవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబరు 29: రాజ్యసభలో వివిధ మంత్రిత్వా శాఖల, వివిధ కమిటీలకు సంబంధించిన పత్రాలను ప్రవేశపెట్టేటప్పుడు ‘ఐ బెగ్ టూ’ పదాన్ని ఉపయోగించవద్దని ఛైర్మన్ వెంకయ్యనాయుడు మరోసారి ఆదేశించారు. శుక్రవారం కేంద్ర న్యాయ కార్పొరైట్ వ్యవహరాల సహాయ మంత్రి పిపి చౌదరి తన మంత్రిత్వాశాఖకు సంబంధించిన పత్రాలను సభలో ప్రవేశపెట్టే సమయంలో ‘ఐ బెగ్ టూ’ అని పలికారు. ఈ సమయంలో ఛైర్మన్ వెంకయ్యనాయుడు జోక్యం చేసుకుంటూ ఆ పదాన్ని ఉపయోగించవద్దని సూచించారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజునే మంత్రులు, సభ్యులకు చైర్మన్ ఈ సూచన చేయడం తెలిసిందే.
డీఆర్‌డీఓ శాస్తవ్రేత్తలను అభినందనలు
ఒడిశాలోని చండీపూర్‌లో రక్షణశాఖ నిర్వహించిన సూపర్ సోనిక్ ఇంటర్‌సెప్టార్ బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతమైవ్వడంపై డిఫెన్స్ రీసెర్జ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఓ) శాస్తవ్రేత్తలను రాజ్యసభ అభినందించింది. శుక్రవారం సభ ప్రారంభం కాగానే ఛైర్మన్ వెంకయ్య ఈ అంశాన్ని ప్రస్తవిస్తూ అభినందలు తెలిపారు.