జాతీయ వార్తలు

మోదీ నిర్ణయాలు సాహసోపేతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 29: పెద్దనోట్ల రద్దు, చారిత్రక రీతిలో జిఎస్‌టి అమలు అన్నవి పటుతరమైన నరేంద్రమోదీ నాయకత్వం వల్లే సాధ్యమయ్యాయని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అన్నరు. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని అందులో భాగంగానే 500, 1000 రూపాయల నోట్లను రద్దుచేశారని, అలాగే ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వస్తుసేవల పన్నును కూడా అమలులోకి తీసుకొచ్చిన ఘనత మోదీనేనని అన్నారు. ఈ సాహసోపేత నిర్ణయాల ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థ రానున్న కొద్ది నెలల్లోనే మరింత శక్తిని సంతరించుకుంటుందని తెలిపారు. ఈ సాహసోపేత నిర్ణయాల అమలు తొలి దశలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిని క్రమానుగతంగా అధిగమించగలిగామని ముంబయి ఐఐటిలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన పారికర్ అన్నారు. దేశ రాజకీయాలను గుణాత్మక రీతిలో ప్రధాని మోదీ ముందుకు తీసుకువెళుతున్నారని పేర్కొన్న ఆయన, వ్యక్తిత్వం, తెలివితేటలు, దూరదృష్టి కలిగిన నాయకుల అవసరం నేటి సవాళ్లమయ వాతావరణంలో ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. కుల రాజకీయాలకు పాల్పడ్డవారు కటకటాల్లో ఉన్నారని పేర్కొన్న ఆయన ఓ బలమైన దృక్పథం, విశాల దృష్టి కలిగిన నేతలే నేడు పాలకులుగా రాణిస్తున్నారని తెలిపారు. అంతర్జాతీయంగా భారత కీర్తిప్రతిష్ఠలు ఈ మూడేళ్లకాలంలో ఎంతగానో ఇనుమడించాయని, ప్రభుత్వంపై ప్రజల ఆశలు, ఆకాంక్షలు కూడా ఎంతగానో పెరిగాయన్నారు. ఈ సందర్భంగా ఐఐటిల ప్రాధాన్యత గురించి మాట్లాడిన పారికర్ దీనివల్ల అవకాశాలు ఇనుమడిస్తాయని, ఈ అర్హతలు కలిగిన నాయకులు ఏ స్థాయి పాలనా వ్యవస్థలోనైనా అద్భుతంగా రాణించగలుగుతారని తెలిపారు. తాను ఐఐటి ఇంజనీర్‌గా పట్టా పుచ్చుకోవడం వల్ల పాలనాపరంగా ఎంతగానో మెరుగైన ఫలితాలను సాధించగలిగానని, అన్నివిధాలుగానూ ఐఐటి పట్టా అన్నది నాయకత్వ లక్షణాలతో రాణించడానికి అన్ని విషయాలనూ విశే్లషించడానికి లోపాలను కనిపెట్టి ముందుగానే నివారించడానికి దోహదం చేస్తుందన్నారు.