జాతీయ వార్తలు

మరో కుంభమేళాగా మేడారం జాతర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: తెలంగాణలో అతి పెద్ద జాతర సమ్మక్క- సారక్క జాతరను మరో కుంభమేళాగా గుర్తించేందుకు కృషి చేస్తానని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జుయేల్ ఓరాం వెల్లడించారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడుతూ కోట్లాది మంది గిరిజనులు, భక్తులు హాజరయ్యే ఈ జాతర గురించి తెలంగాణ బీజేపీ నాయకులు తనకు వివరించినట్టు తెలిపారు. గిరిజన మంత్రిత్వ శాఖలో దీనిపై చర్చించి మరో కుంభమేళాగా గుర్తించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు తెలంగాణ బీజేపీ నాయకులు ప్రేమేంధర్‌రెడ్డి, సాంబమూర్తి తదితరులు కేంద్రమంత్రులు జేపీ నడ్డా, స్మృతి ఇరానీ, జుయేల్ ఓరాంలను కలిసి మేడారం జాతరకు రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.