జాతీయ వార్తలు

ఓట్లకోసమే బీసీలకు తాయిలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: వచ్చే ఎన్నికల్లో ఓట్లకోసమే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బీసీలకు తాయిలాలు ప్రకటిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు ఆరోపించారు. ఢిల్లీలో శనివారం హనుమంతరావు విలేఖరులతో మాట్లాడుతూ బీసీలను కులాల వారీగా విభజించి ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం మొదలు పెట్టారని, దీన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రికి బీసీలపై ఉన్నది ప్రేమ కాదని, అత్యధికంగా ఉన్న బీసీ ఓటు బ్యాంకు మీదనేనని ఆయన చెప్పారు. తెలంగాణలో 54శాతం ఉన్న బీసీలకు లెక్కప్రకారం తొమ్మిది మంత్రి పదవులు ఇవ్వాలని, కేసీఆర్ మంత్రివర్గంలో కేవలం నాలుగురు మాత్రమే బీసీ మంత్రులు ఉన్నారని వెల్లడించారు. 2019 ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ పనిచేయదని గ్రహించే, ముఖ్యమంత్రి కుల రాజకీయాలకు తెరదీశారని ఆయన పేర్కొన్నారు. గొల్ల కురుమల భవనం శంకుస్థాపన సందర్భంగా కర్ణాటక మంత్రి, ఆల్ ఇండియా గొల్ల కురుమల అసొషియేషన్ అధ్యక్షుడు రెవన్న వాస్తవాలు తెలియకుండా టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని పొగిడారని ఆయన చెప్పారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం కుల సంఘాల మెప్పుకోసం నిజాం భూములను దానధర్మాలు చేస్తున్నారని ఆరోపించారు. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కేసీఆర్ అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఇంటికో ఉద్యోగం, మూడెకరాల భూమి, డబుల్ బెడ్‌రూం ఇళ్లు వంటి హామీల అమలు కాలేదన్నారు. ముఖ్యమంత్రి కొత్త హామీలు ఇవ్వడం మానుకొని పాత హామీలను పూర్తిగా అమలుచేయాలని డిమాండ్ చేశారు.