జాతీయ వార్తలు

కళ్లు తెరిచిన బీఎంసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 30: గురువారం అర్ధరాత్రి ముంబయి కమలా మిల్స్‌లోని ఓ పబ్‌లో జరిగిన అగ్నిప్రమాదంతో బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కళ్లు తెరిచింది. నగరంలో అక్రమ నిర్మాణాలపై కూల్చివేత చర్యలకు శ్రీకారం చుట్టింది. ఒక్క శనివారమే దాదాపు 100 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఈ కార్యక్రమంలో దాదాపు వేయి మంది అధికారులు, కార్మికులు పాల్గొన్నారు. సెంట్రల్ ముంబయితోపాటు సబ్‌అర్బన్ ప్రాంతాలైన మలద్, ములుంద్ ప్రాంతాల్లోనూ కూల్చివేత చర్యలు చేపట్టారు. అక్రమంగా నిర్వహిస్తున్న రెస్టారెంట్లు, పబ్‌లు, హోటళ్లే లక్ష్యంగా దాడులు నిర్వహించారు.
3 కేసులు నమోదు
కమలా మిల్స్‌లోని పబ్‌లో అగ్ని ప్రమాదం జరిగిన 14 మంది మృతిచెందిన ఘటనపై పబ్ నిర్వాహకులు, మాల్ యాజమాన్యంపై పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. ‘మోజోస్ బిస్‌ట్రో’, ‘1 అబవ్’ పబ్‌లపై కేసులు నమోదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. 1అబవ్ పబ్‌ను పర్మిషన్ లేకుండా విస్తరించినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

చిత్రం..ముంబయలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న దృశ్యం