జాతీయ వార్తలు

ట్యాంపరింగ్‌తోనే బీజేపీ విజయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (బెంజిసర్కిల్), డిసెంబర్ 30: ప్రధానిగా నరేంద్ర మోదీ అధికారంలోనికి వచ్చిన నాటి నుండి మొన్నటి గుజరాత్ ఎన్నికల వరకు ఈవీఎంమ్‌లను ట్యాంరింగ్ చేయడంతోనే యుపీ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందని సమజ్‌వాదీ పార్టీ ఏపి ఇన్‌ఛార్జ్, జాతీయ ప్రధాన కార్యదర్శి రాజీవ్ రాయ్ ఆరోపించారు. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సమాజ్‌వాదీ పార్టీ నూతన రాష్ట్ర కార్యాలయాన్ని ఆయన జాతీయనేత, రాజ్యసభ ఎంపి డాక్టర్ చంద్రపాల్ సింగ్ యాదవ్‌తో కలసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో జీడీపీని పెంచుతాం...కోటి ఉద్యోగాలను కల్పిస్తామన్న మోదీ, అధికారంలోనికి వచ్చాక జీడీపీ గణనీయంగా తగ్గించి, ఉన్న ఉద్యోగాలు తీస్తున్న స్థితికి తీసుకు వచ్చారని విమర్శించారు. రాజ్యాంగ విలువలకు తీలోదకాలిస్తున్న మోదీ సర్కారు తీరును దేశప్రజలు గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభవం తప్పదని అభిప్రాయపడ్డారు. మొన్న జరిగిన ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందనడాన్ని ఓటింగ్ శాతంమే రుజువు చేస్తోందన్నారు. బ్యాలెట్ పేపర్‌తో కన్నా ఎన్నో రెట్ల ఔటింగ్ శాతం ఈవీఎంమ్‌ల ద్వారా జరిగిందని, ఇది అధికార పక్షం చేసిన మరో కుట్రన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీతో ప్రజలు అనేక ఇబ్బందులు ఇప్పటికి ఎదుర్కొంటున్నారని, వాటిని పరిష్కరించడంలో మోదీ ఘోరంగా విఫలమైయిందన్నారు. నేర చరిత్ర ఉన్న వాళ్ళు రాజకీయాల్లో పోటీకి అనర్హలన్న ఆయన అటువంటి వారికి తమ పార్టీలో స్ధానం లేదన్నారు. యుపీ తరహాలో ఏపీలో కూడా పార్టీని క్షేత్రస్థాయి వరకు తీసుకు వెళ్తామని ప్రకటించారు. ఎంపి చంద్రపాల్ సింగ్ యాదవ్ మాట్లాడుతూ అన్ని ప్రాంతాల, అన్ని వర్గాల ప్రజలకు మతం, కులం, ప్రాంతంతో సంబంధం లేకుండా సమన్యాయం చేసే పార్టీ సమాజ్‌వాదీ పార్టీనే అన్నారు. ఉత్తరం నుంచి దక్షిణం వరకు అన్ని సమస్యలపైనా అవగాహన ఉండి పోరాడే పార్టీ జాతీయ స్థాయిలో సమాజ్‌వాదీ పార్టీ ఒక్కటేనన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగదీష్ యాదవ్ మాట్లాడుతూ పార్టీని రాష్ట్రంలోని ప్రజల్లోకి తీసుకు వెళ్తెందుకు పార్టీ కార్యకర్తలు కృషి చేయాలన్నారు. విభజన హామీలపై త్వరలోనే ఆందోళనను మరింత ఉదృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు వరప్రసాద్‌తో పాటు పలు జిల్లాల నుండి వచ్చిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..