జాతీయ వార్తలు

‘స్మార్ట్‌సిటీ’ ఏమైంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వరస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. ప్రియమైన మోదీ భక్తులంటూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పూర్తిగా విఫలం చెందిందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టాలని చూచించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ- ఈ ప్రాజెక్టుకోసం కేటాయించిన రూ.9860 కోట్లలో ఇప్పటివరకు కేవలం ఏడు శాతం నిధులనే ప్రభుత్వం ఖర్చు చేసిందని ఆరోపించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు జూన్, 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందని, ఈ రెండేళ్ల కాలంలో కేంద్రం చేసింది ఏమీ లేదని పేర్కొన్నారు. స్మార్ట్ సిటీలలో నీరు, విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, ప్రజా రవాణ, ఇ-గవర్నెన్స్ లాంటి వౌలిక సాదుపాయాల కల్పనలో కేంద్రం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. అభివృద్ధిలో చైనా మనల్ని దాటి ముందుకు వెళుతుంటే మోదీ కేవలం నినాదాలకే పరిమితమయ్యారని అన్నారు. యువతకు ఉద్యోగాలను కల్పించేందుకు ఏంచేయాలో నరేంద్ర మోదీ భక్తులు తమ గురువుకు చూచించాలని రాహుల్ చురకలు అంటించారు. చైనాలోని షెంజేన్‌లో నూతన ఆవిష్కరణలు, సంస్కరణలకు సంబంధించిన వీడియోను కూడా రాహుల్ ట్వీట్ చేశారు.