జాతీయ వార్తలు

ఇది మీడియా హడావుడే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ రాజకీయ ప్రవేశం ఓ హడావుడి మాత్రమేనని అందులో ఎలాంటి పసా లేదని బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్యం స్వామి వ్యాఖ్యానించారు. పైగా రజినీకాంత్ నిరక్షరాస్యుడని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రజినీకాంత్ కొత్త రాజకీయ పార్టీ పెట్టడం అన్నది మీడియా ప్రచారాన్ని సంతరించుకోవచ్చునేమోగాని దానివల్ల ఒరిగే ప్రయోజనం ఏమీ ఉండదని రాజ్యసభ్యుడైన సుబ్రహ్మణ్యం స్వామి పేర్కొన్నారు. తమిళనాడు ప్రజలు తెలివైన వాళ్లని, రజినీకాంత్ కొత్త రాజకీయ పార్టీవల్ల వారు ఆకర్షితులయ్యే అవకాశమే లేదని తెలిపారు. కేవలం రాజకీయాల్లో ప్రవేశిస్తున్నానని మాత్రమే రజినీ చెప్పారు తప్ప అందుకు సంబంధించిన కీలక వివరాలు గాని, పత్రాలు గాని లేవని స్వామి పేర్కొన్నారు. కాగా రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడం వల్ల రాష్ట్రంలో ఎలాంటి ప్రభావం ఉండదని అన్నాడిఎంకె శశికళ వర్గం నాయకుడు టిటివి దినకరన్ అన్నారు. రాష్ట్రంలో మరో ఎజీఆర్ లేక జయలలిత పుట్టుకొచ్చే అవకాశమే లేదని అన్నారు.