జాతీయ వార్తలు

డిప్లొమాలకు బదులు డిగ్రీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 1: దేశంలోని వివిధ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లు తమ సంస్థల మనుగడకు ఇకపై స్వయంప్రతిపత్తితో నిర్ణయం తీసుకోవడానికి కొత్తగా రూపొందే చట్టం దోహదం చేయనుంది. ఆయా సంస్థల్లో ఇపుడున్న డిప్లొమాలకు బదులుగా ఇకముందు డిగ్రీలను అందజేందుకు ఉద్దేశించిన ‘ది ఇండియన్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ మేనేజిమెంట్ బిల్ 2017’ రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ పరిశీలనకు వచ్చి చట్టంగా మారింది. ఈ బిల్లు గత యేడాది జూలైలో లోక్‌సభలో, డిసెంబర్‌లో రాజ్యసభలో ఆమోదం పొందింది. దీని ప్రకారం ఐఐఎంలు పనిచేయడానికి, డైరెక్టర్లు, ఫ్యాకల్టీ మెంబర్ల నియామకానికి వీలుకలుగుతుంది. ది ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ యాక్ట్, 2017 ప్రకారం ఇప్పటివరకు ఉన్న డిప్లొమాలకు బదులుగా ఇకముందు డిగ్రీలను ప్రదానం చేసేందుకు ఆస్కారం కలుగుతుంది. ఐఐఎంల స్వయంప్రతిపత్తికి ఈ బిల్లు దోహదం చేస్తుంది. ఈ నూతన బిల్లు ఐఐఎంలలో ప్రభుత్వ, అధికారుల ప్రమేయం వల్ల జరుగుతున్న దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడమే కాకుండా సంస్థ మనుగడను కాపాడేందుకు ఏ రకమైన చర్యలు తీసుకోవాలో నిర్దేశిస్తుందని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఈ బిల్లుపై గత నెల రాజ్యసభలో జరిగిన చర్చలో వివరించారు.