జాతీయ వార్తలు

ఆరుగుర్ని కొట్టిచంపిన మాజీ లెఫ్టినెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పల్వాల్, జనవరి 2: హర్యానాలోని పల్వాల్‌లో మంగళవారం వేకువజామున దారుణం చోటుచేసుకుంది. మతిభ్రమించిన ఓ మాజీ సైనిక ఉద్యోగి ఇనుపరాడ్‌తో ఆరుగుర్ని కొట్టి చంపేశాడు. తెల్లవారుజామున 2.30 నుంచి 3.30 మధ్య ఈ బీభత్సకాండ సాగింది. పోలీసుల కథనం ప్రకారం నరేష్ ధన్‌కాడ్ అనే 40ఏళ్ల వ్యక్తి సైన్యంలో లెఫ్టినెంట్‌గా పనిచేశాడు. ఆరోగ్య కారణాలతో 2003లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశాడు. మంగళవారం తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతంలో పల్వాల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలోకి ప్రవేశించాడు. నీలం రంగు స్వెట్టర్, తెలుపుఫ్యాంట్ ధరించిన నరేష్ ఆసుపత్రి కారిడార్‌లో తచ్చాడుతూ సీసీటీవీ కెమెరాలో కనిపించాడు. చేతిలో ఇనుప రాడ్ పట్టుకును ఎవరి కోసమో ఎదురుచూశాడు. బంధువులను పరామర్శించడాని వచ్చిన 35 ఏళ్ల అంజుం అనే మహిళను రాడ్‌తో కొట్టి చంపేశాడు. ఆసుపత్రి మొదటి అంతస్తు ఆవల ఇంటెన్సివ్‌కేర్ యూనిట్ వద్ద నిద్రిస్తున్న ఆమెపై దాడికి తెగబడ్డాడు. అక్కడ నుంచి ఆగ్రా రోడ్డు ఇంటర్‌సెక్షన్‌కు వెళ్ళి ముగుర్ని రాడ్‌తో కొట్టగా అక్కడికక్కడే మృతి చెందారని పల్వాల్ ఎస్పీ సులోచన కుమారి తెలిపారు. అక్కడే మరొక ఇద్దర్ని పొట్టనబెట్టుకున్నాడని ఆమె చెప్పారు. అలాగే సెక్యురిటీ గార్డును వదిలిపెట్టలేదు. రాడ్‌తో కొట్టి హత్య చేశాడని అన్నారు. ఈహత్యలన్నీ గంటలోపే చేశాడని పోలీసులు వెల్లడించారు. సీసీటీవీలోని దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. ఒక హత్య పోలీసు స్టేషన్ సమీపంలోనే జరిగిందని ఎస్పీ పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు హంతకుణ్ని పట్టుకోడానికి వెళ్లగా వారిపైనా దాడి చేశాడు. ఈ సందర్భంగా పలువురు పోలీసులూ గాయపడ్డారని డిప్యూటీ పోలీసు సూపరింటిండెంట్ అభిమన్యు లోహాన్ తెలిపారు. సంఘటనా స్థలాన్ని సందర్శిస్తే నిందితుడు లూఠీ చేయడానికి వచ్చిన దాఖలాలు లేవు. అతికష్టం మీద సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆదర్శ్‌నగర్ దగ్గర హంతకుడిని పట్టుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి సమీపంలోనే ఆదర్శ్‌నగర్ ఉంటుంది. అరెస్టయిన మాజీ సైనికుణ్ని తొలుత సివిల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి ఫరీదాబాద్ రిఫర్ చేశారు. తరువాత ఢిల్లీ సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ పోలీసులను ఫరీదాబాద్ ఆసుపత్రికి తరలించారు.