జాతీయ వార్తలు

పాక్ కాల్పుల్లో ఆర్మీ జవాను మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్ము, జనవరి 13: కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాకిస్తాన్ లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద జరిపిన కాల్పుల్లో ఒక ఆర్మీ జవాను మృతిచెందాడు. రాజౌరీ జిల్లాలోని సుందర్‌బనీ హెక్టార్‌లో విధులు నిర్వహిస్తున్న లాన్స్ నాయక్ యోగేష్ మురళీధర్ భదానె (22) పాక్ ఆర్మీ అకస్మాత్తుగా జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డాడని, ఆసుపత్రికి తరలించే లోపే ఆయన మృతిచెందాడని ఆర్మీ అధికారులు తెలిపారు. మురళీధర్ మహారాష్టల్రోని ధూలే జిల్లా ఖలాగే గ్రామానికి చెందినవాడని వివరించారు. రాజౌరీ జిల్లాలోనే డిసెంబర్ 31న సిపాయ్ జగ్‌సిర్ సింగ్ పాక్ జరిపిన కాల్పుల్లో మృతిచెందిన విషయం తెలిసిందే.

చిత్రం..శ్రీనగర్-బారాముల్లా హైవే శివారులో ఉగ్రవాదులు అమర్చిన బాంబులను
నిర్వీర్యం చేస్తున్న ఆర్మీ నిపుణులు