జాతీయ వార్తలు

ఎర్రకోట వద్ద మార్చిలో మహాయజ్ఞం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 22: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వెలుపల మైదానంలో వారం రోజుల పాటు వేదిక్ యజ్ఞం జరగబోతోంది. దేశాన్ని అస్థిరపరచే శక్తులను నుంచి భారత్‌ను రక్షించాలన్న ఉద్దేశంతో ఈ మహాయజ్ఞం తలపెట్టినట్టు బీజేపీ ఎంపీ మహేష్ గిరి సోమవారం ఇక్కడ వెల్లడించారు. మార్చి 18 నుంచి 25 వరకూ దీన్ని నిర్వహించనున్నట్టు చెప్పారు. రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు రాజకీయ ప్రముఖులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్టు ఆయన స్పష్టం చేశారు. భారీగా ఏర్పాటవుతున్న ఈ యజ్ఞానికి 1,100 మంది సాధువులు పాల్గొంటారు. ఢిల్లీకి చెందిన పలువురు వ్యాపారవేత్తలు వేదిక్ యజ్ఞానికి విరాళాలు అందజేస్తున్నారని ఎంపీ పేర్కొన్నారు. కార్యక్రమం ఏర్పాటు దగ్గర నుంచి ఆహ్వానాల దగ్గర నుంచి ఎక్కడా పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. మార్చిలో జరిగే మహాయజ్ఞానికి సంబంధించి కార్యక్రమాన్ని ప్రకటించారు. డోక్లామ్ నుంచి, అలాగే పూంచ్‌లోని ఎల్‌ఓసీ దగ్గర నుంచి మట్టి, నీరును యజ్ఞానికి తీసుకొస్తారు. అలాగే దేశవ్యాప్తంగా రథయాత్రలు నిర్వహించి ఆవునెయ్యిని రాజధానికి తెస్తారని, ఇక్కడకు వచ్చే ప్రతి ఒక్కరూ మనిషికి ఒక్క స్పూను నెయ్యి తీసుకురావాలని పిలుపునిస్తున్నట్టు బీజేపీ ఎంపీ చెప్పారు.