జాతీయ వార్తలు

సరిహద్దుల్లో దినదిన గండం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ, జనవరి 22: జమ్మూకాశ్మీర్ సరిహద్దులో నివసించేవారి పరిస్థితి దినదిన గండం.. నూరేళ్ల ఆయుష్షు అన్నట్టుగా మారిపోయింది. బాంబుల మోతలతో సరిహద్దులో అనిశ్చిత వాతావరణం నెలకొంది. కాల్పులు, ఎదురు కాల్పుల ఘటనలో జనం ప్రమాదపుటంచున బితుకు బితుకు మంటూ కాలం గడుపుతున్నారు. ఎవరెప్పుడు విరుచుకుపడతారో అన్న భయం మధ్యే రోజులు గడుపుతున్నారు. అంతర్జాతీయ సరిహద్దులో జరిగిన ఓ కాల్పుల సంఘటన ఓ కుటుంబం కలలను ఛిద్రం చేసింది. ఎవర్ని కదిపినా కన్నీటి గాథలే. అంతర్జాతీయ సరిహద్దులో ఇటీవల చోటుచేసుకున్న కాల్పుల ఘటన ఓ కుటుంబానికి తీరని విషాదం మిగిల్చింది. సరిహద్దులోని సియాఖుర్ద్ గ్రామంలో మోర్టల్ దాడిలో దంపతులు గాయపడ్డారు. కాల్పుల దాటికి భార్య బఛానోదేవి చనిపోగా, భర్త జీత్‌రాజ్‌కు ప్రాణపాయం తప్పింది. పాక్ కాల్పుల్లో జీత్ రాజ్ కుమారుడూ గాయపడ్డాడు. పొలాల్లో పనిచేసుకుంటుండా అకస్మాత్తుగా మోర్టల్ పడిందని రాజ్ చెప్పాడు. తమ కళ్లముందే భార్య కుప్పకూలి చనిపోయిందని కన్నీళ్లపర్యంతమయ్యాడు. తనను, తన కొడుకుని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారని, తన అర్ధాంగి మాత్రం చూస్తుండగానే ప్రాణాలు విడిచిందని రోదిస్తూ చెప్పాడు. తన గాయాలు మానిపోతున్నాయని గానీ తన హృదయానికి అయిన గాయం తొలిచేస్తోందని జీత్‌రాజ్ ఆవేదన చెందాడు. సరిహద్దుల్లో నివసిస్తున్న వారి కుటుంబాల్లో పాక్ తుపాకీలు తీరని వేదన మిగులుస్తున్నాయి. సరిహద్దుల్లో రోజూ ఇలాంటి యుద్ధ వాతావరణమే ఉంటోందని జీత్ రాజ్ వాపోయారు. జమ్మూజిల్లాలో కంఛక్ బెల్ట్‌లో ఆదివారం పాక్ రేంజర్ల కాల్పుల్లో ఒక పౌరుడు మృతి చెందాడు. ఇద్దరు గాయపడ్డారు. గత గురువారం నుంచి కాల్పుల్లో కనీసం 12 మంది చనిపోగా 60 మందికిపైగా గాయపడ్డారు. అంతర్జాతీయ సరిహద్దు, ఎల్‌ఓసి వద్ద అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మరో మూడు రోజులు విద్యా సంస్థలు తెరుచుకునే అవకాశం లేదు.

చిత్రం..జమ్మూకు సమీపంలోని కానాచెక్ గ్రామంలో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో దెబ్బతిన్న గోడను చూపుతున్న ఓ మహిళ