జాతీయ వార్తలు

నేరం చేయని ఖైదీలు.. ఆ నలుగురు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, ఫిబ్రవరి 5: క్షణం తీరిక లేని వ్యాపారమే అయినా సామాజికపరమైన సేవలో తనవంతు కృషి చేస్తూ అనేక అవార్డులు అందుకున్న అంతర్జాతీయ బంగారు నగల వ్యాపారి బాబీ చెమ్మనూర్ సహా కేరళ రాష్ట్రానికి చెందిన మరో ముగ్గురు సోమవారం సంగారెడ్డిలోని పురాతన జైలుకు తరలివచ్చారు. జైలులో ఒక రోజుండి ఆ అనుభూతిని పొందడానికి ఇక్కడికి వచ్చినట్లు బాబీ చెమ్మనూర్ తెలిపారు. తనకు 15 సంవత్సరాల క్రితం జైలులో ఉండాలనే ఆకాంక్ష కలిగిందని, నేరం చేయకుండానే జైలులో ఖైదీలు ధరించే బట్టలతో కాలం వెళ్లదీసే అవకాశం సంగారెడ్డి జైలులో లభించడం సంతోషంగా ఉందన్నారు. రక్తదానంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి 812 కిలోమీటర్లు పరుగెత్తి అవార్డును సొంతం చేసుకున్నట్లు తెలిపారు. సామాజికపరమైన సేవలకు కూడా మదర్ థెరిసా అవార్డు లభించిందన్నారు. మధ్యాహ్నం సంగారెడ్డికి చేరుకున్న బాబీ చెమ్మనూర్‌తోపాటు అతని సహాయకుడు ప్రశాంత్, సివిల్ ఇంజనీర్ అయిన ఆసీర్ అలీ, మాజీ జర్నలిస్ట్, కళాకారుడైన బినయ్ రూ.500 చొప్పున రుసుం చెల్లించిన అనంతరం ఖైదీలకు ఇచ్చే దుస్తులు, ప్లేటు, గ్లాసు తదితర వస్తువులను అందజేసారు. ఖైదీలుగా మారిన ఆ నలుగురు వ్యక్తులు మొక్కలకు నీళ్లు పట్టడం, శ్రమదానం వంటివి చేశారు.