జాతీయ వార్తలు

పదిన వస్తానన్నాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, ఫిబ్రవరి 5: ఆదివారం సరిహద్దుల్లో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో మృతిచెందిన కెప్టెన్ కపిల్ కండు కేవలం 22ఏళ్ల యువకుడు. ఈ నెల 10న ఆయన 23వ ఏట అడుగుపెట్టనున్నారు. పుట్టిన రోజుకు స్వగ్రామం హర్యానాలోని రన్సికా గ్రామం వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంతలోనే ఈ దారుణం జరిగిపోయింది. జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్, రాజౌరి సెక్టార్ల సరిహద్దుల్లో ఆదివారం పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతిచెందిన విషయం తెలిసిందే. వారిలో కెప్టెన్ కపిల్ ఖండు కూడా ఉన్నారు. ‘కపిల్ ఫిబ్రవరి పదికల్లా ఊరొస్తానన్నాడు. ఇలాంటి విషయాలేమీ నాకు చెప్పడు.. చెల్లెళ్లకు మాత్రమే చెపుతాడు... అలా నన్ను సర్‌ప్రైజ్ చేస్తూ ఉంటాడు.. ప్రతి విషయాన్ని వాళ్లతో షేర్ చేసుకుంటాడు’ అంటూ కపిల్ తల్లి సునీత బావురుమన్నారు. ‘నవంబర్‌లో స్వగ్రామానికి వచ్చి వెళ్లాడు.. ఎప్పుడూ సాహసాలు చేయడానికే ప్రయత్నిస్తాడు. ప్రకృతిని ఎంతో ప్రేమిస్తాడు. అతనిలో చక్కని రచయిత కూడా ఉన్నాడు. దేశం అంటే అమితమైన ప్రేమ.. తన దేశం ఉన్నత శిఖరాల్లో ఉండాలని ఆశిస్తాడు’ అని ఆమె పేర్కొన్నారు.

చిత్రాలు..ఆదివారం పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో మృతిచెందిన..కెప్టెన్ కపిల్ కండు (22) * జవాన్ హల్వీందర్ రోషన్ లాల్ (42) * సిపాయిలు రామవతార్ (27) *శుభం సింగ్ (23)