జాతీయ వార్తలు

వారికీ ప్రసూతి సెలవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: అద్దెగర్భం (సరోగసీ) ద్వారా పిల్లలు కలిగిన కేంద్రప్రభుత్వ ఉద్యోగినులకు కూడా సాధారణ గర్భిణుల మాదిరిగా ప్రసూతి సెలవు వర్తిస్తుందని సంబంధిత మంత్రిత్వశాఖ అధికారిక ఉత్తర్వులో పేర్కొంది. వేతనంతో కూడిన 26 వారాల (180 రోజుల) సెలవును వారు పొందవచ్చునని ఆ ఉత్తర్వులో స్పష్టం చేశారు. 2015లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రిత్వశాఖ అన్ని కేంద్రప్రభుత్వ సంస్థలకు సమాచారం పంపింది. ఈ అంశా న్ని సవివరంగా ఉద్యోగవర్గాలకు చేరవేయాలని, విస్తృత ప్రచారం కల్పించాలని ఆ ఉత్తర్వులలో ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రతిని కూడా ఆ ఉత్తర్వులకు జతపరిచింది. అద్దెగర్భం ద్వారా కవల పిల్లలను పొందిన తనకు ప్రసూతి సెలవు మంజూరు చేసేందుకు నిరాకరించారని, తనకు న్యాయం చేయాలని కేంద్రీ య విద్యాలయం ఉపాధ్యాయుని ఒకరు కోర్టును ఆశ్రయించగా కోర్టు స్పందించి సరోగసీ తల్లులకు కూడా ప్రసూతి సెలవు వర్తింప చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ‘అద్దెగర్భం’తో ఉన్న ఉద్యోగిని, అద్దెగర్భం ద్వారా పిల్లలను పొందిన ఉద్యోగినులలో ఎవరికి, ఎప్పుడు సెలవు ప్రసూతి సెలవు ఇవ్వాలన్న విషయంలో సరైన నిర్ణయాన్ని సంబంధిత అధికారులు తీసుకోవాలని కోర్టు సూచించింది.