జాతీయ వార్తలు

మంత్రివర్గం నుంచి బయటికి రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీయే ప్రభుత్వంతో విభేదిస్తున్న తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి మంత్రివర్గం నుండి రాజీనామా చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్‌డీయేలో భాగస్వామిగా కొనసాగుతూనే ప్రభుత్వంతో ఎలా విభేదిస్తారని ఆయన నిలదీశారు. ‘మిమ్మల్ని సభనుండి పంపించివేయవలసి వస్తుంది’ అని హెచ్చరించిన సభాధ్యక్షుడు వెంకయ్యనాయుడుతో ఆయన వాదనకు దిగారు. ‘మీరు ఏం చేసినా ఫరవాలేదు’ అని విజయసాయి రెడ్డి బదులివ్వటంతో వెంకయ్య ఆగ్రహం చెందారు. ‘మీపై కఠిన చర్యలు తీసుకోవలసి వస్తుంది’ అని ఆయన హెచ్చరించారు.
విజయసాయి రెడ్డి రాజ్యసభలో పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తుతూ విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సభలో ప్రకటన చేయాలని సుజనా చౌదరి ఎలా డిమాండ్ చేస్తారని ప్రశ్నించారు. రాజ్యసభలో తెలుగుదేశం ఎంపీలు విభజన హామీలను అమలు చేయాలంటూ సభలో గొడవ చేయటాన్ని పరిష్కరించేందుకు సూచనలు ఇచ్చే అధికారం సుజనా చౌదరికి ఉన్నదని వెంకయ్య రూలింగ్ ఇచ్చారు. ఈ సూచనతో విజయసాయి రెడ్డి ఏకీభవించలేదు. సుజనా చౌదరి మంత్రివర్గంలో కొనసాగుతూ ప్రభుత్వంతో ఎలా విభేదిస్తారని ప్రశ్నించారు. అలా చేయలంటే మొదట మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌ను సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు నరేష్ అగర్వాల్, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు పూర్తిగా బలపరిచారు. దీనితో సభలో తీవ్ర గందరగోళం నెలకొనటంతో సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు.
ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపడుతున్న సమయంలో తెలుగుదేశం సభ్యులు సీఎం రమేష్, గరికపాటి రామ్మోహన్ రావు, తోట సీతారామలక్ష్మి, టీజీ వెంకటేశ్, కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచందర్‌రావు పోడియం వద్దకు వచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ విభజన హామీలు అమలు చేయాలనే నినాదాలిచ్చారు. రామచందర్‌రావు వౌన ప్రదర్శన కొనసాగించారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి సభ్యులు అడ్డుపడడం మంచిది కాదని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రం మండుతోంది కాబట్టి ఈ సమస్యను పరిష్కరించాలని రమేష్ సూచించారు. సుజనా చౌదరి స్పందిస్తూ విభజన చట్టాన్ని అన్యాయంగా ఆమోదించారు, దీనికి రెండు జాతీయ పార్టీలు బాధ్యత వహించాలి, ప్రస్తుతం నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు ఉక్కు కార్మాగారం, అమరావతికి సహాయం, ప్రత్యేక హోదా, బడ్జెట్ లోటు భర్తీ తదితర సమస్యల పరిష్కారానికి అరుణ్ జైట్లీ హామీ ఇవ్వాలి. పదిహేను రోజుల్లో వీటిని పరిష్కరిస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పుడే ఈ సమస్య పరిష్కారం అవుతుందని స్పష్టం చేశారు. వెంకయ్య సూచన మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి విజయ్ గోయల్ మాట్లాడుతూ అరుణ్ జైట్లీ బడ్జెట్‌పై బదులిచ్చే సమయంలో ఈ సమస్యల పరిష్కారంపై స్పందిస్తారని హామీ ఇచ్చారు. సుజనా చౌదరి మంత్రివర్గం సభ్యుడై ఉంటూ మరో మంత్రిని డిమాండ్ ఎలా చేస్తారని ఎస్పీ సభ్యుడు నరేష్ అగర్వాల్ నిలదీశారు.
కేవీపీ రామచందర్‌రావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టాలు, సమస్యలు, విభజన హామీల గురించి ఇక్కడ మాట్లడకపోతే ఇంకెక్కడ మాట్లాడుతామని ప్రశ్నించారు. విభజన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విభజన చట్టాన్ని ఆమోదించిన రాజ్యసభ గౌరవాన్ని నిలపకపోతే ఎలా? అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ఎలా? అని ఆయన నిలదీశారు. ఈ దశలో విజయసాయి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తుతూ మంత్రులందరూ సమష్టి బాధ్యత వహిం
చాల్సిదేనని అన్నారు. ప్రభుత్వంతో విభేదించాలంటే సుజనా చౌదరి మొదట తన మంత్రిపదవికి రాజీనామా చేయాలని, తెలుగుదేశం ఎన్‌డీయే నుండి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. విజయసాయి పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను వెంకయ్య తిరస్కరించారు. రాజ్యాంగ విరుద్ధంగా ఏమీ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. సుజనా చౌదరి కేవలం సూచన చేశారు తప్ప ప్రభుత్వంతో విభేదించలేదని స్పష్టం చేశారు. నరేష్ అగర్వాల్ తదితరులు విజయసాయి వాదనను సమర్థించారు. ఒక మంత్రి ప్రస్తావించిన అంశానికి రెండో మంత్రి బదులివ్వవచ్చా? అని ప్రశ్నించారు. ఒక సమస్యను పరిష్కరించేందుకు అధ్యక్షుడి సలహాతో మంత్రులు సలహాలు ఇవ్వవచ్చునని వెంకయ్య రూలింగ్ ఇచ్చారు. విజయసాయితోపాటు సమాజ్‌వాదీ, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు రూలింగ్‌తో ఏకీభవించలేదు. వెంకయ్యతో విజయసాయి రెడ్డి వాదనకు దిగారు. అధ్యక్షుడి అనుమతి తీసుకోకుండానే మాట్లాడుతారా? అని వెంకయ్యనాయుడు ఆయనను ప్రశ్నించారు. సుజనా చౌదరి మంత్రిపదవికి రాజీనామా చేయాలి, తెలుగుదేశం పార్టీ ఎన్‌డీయే నుండి వైదొలగాలని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. మిమ్మల్ని సభనుండి పంపించివేయవలసి వస్తుందని చైర్మన్ ఆయనను హెచ్చరించిన అనంతరం సభను వాయిదా వేశారు.