జాతీయ వార్తలు

ఏపీ హక్కులకోసం దద్దరిల్లిన పార్లమెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ఆంధ్రప్రదేశ్ విభజన హామీలను అమలు చేయాలంటూ రాష్ట్రానికి చెందిన ఎంపీలు పార్లమెంట్ లోపలా, బయటా వరుసగా మూడోరోజూ ఆందోళన చేపట్టారు. గురువారం టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉభయ సభల్లో తమ పోరాటాన్ని ఉధృతం చేశారు. పార్లమెంట్‌లో అవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు తోట నర్సిహం, కె.రామ్మోహన్ నాయుడు, అవంతి శ్రీనివాస్, పండుల రవీంద్రబాబు, మురశీమోహన్, మాగంటి బాబు, కొనగళ్ల నారాయణరావు, గల్లా జయదేవ్, కేశినేని నాని, శ్రీరాం మాల్యాద్రి, నిమ్మల కిష్టప్ప, రాజ్యసభ సంభ్యులు సీఎం రమేష్, తోట సీతారామలక్ష్మి, టీజీ వెంకటేష్, గరికపాటి రామ్మోహన్‌రావు ప్లకార్డులు ప్రదర్శిస్తూ, ఏపీకి న్యాయం చేయాలంటూ నినాదాలిస్తూ ఆందోళన చేశారు. ఎంపీ శివప్రసాద్ ప్రత్యేక వేషధారణలో డప్పును మోగిస్తూ పాటలు పాడి నిరసన తెలిపారు. మరోవైపు వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, మిధున్‌రెడ్డి, వైఎస్ అవినాశ్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద నిరసన తెలిపారు. రాష్ట్రానికి బడ్జెట్‌లో జరిగిన అన్యాయాన్ని సరిచేయాలని, విభజన హామీలను అమలుచేయాలని ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అనంతరం లోక్‌సభ ప్రారంభకాగానే టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు స్పీకర్ పోడియం వద్దు నిలబడి ప్లకార్డులు పదర్శిస్తూ నినాదాలిస్తూ నిరసనను కొనసాగించారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ పోడియం వీడి తమ స్థానాల్లో కుర్చోవాలని టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలను విజ్ఞప్తి చేశారు. ఎంపీలంతా అదేమీ పట్టించుకోలేదు. ఈ పరిస్థీతులలో టీడీపీ ఎంపీ శివప్రసాద్ ఢమరుకం మోగిస్తూ హడావిడి చేశారు. రైల్వేజోన్ క్యా హువా, స్పెషల్ స్టేటస్ క్యా హువా అని ఎంపీ కిష్ణప్ప అంటే.. మిగతా టీడీపీ ఎంపీలు గోవిందా... గోవిందా అంటూ నినాదాలు చేశారు. ఈ పరిస్థితుల్లో ఏపీ అంశంపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడతారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ చేసిన విజ్ఞప్తిని కూడా ఎంపీలు పట్టించుకోలేదు. ఎంపీ శివప్రసాద్ స్పీకర్ సచివాలయ సిబ్బంది వద్ద ఉండే నియామవాళి పుస్తకాలను లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సిబ్బందికి ఇబ్బంది కలిగించవద్దని హెచ్చరించారు. అనంతరం సభను 15 నిమిషాలపాటు వాయిదా వేసి టీడీపీ, వైకాపా ఎంపీలను తన చాంబర్‌కి రావాలని కోరారు. ఎంపీలు కొంతమంది స్పీకర్ దగ్గరకు వెళ్లారు. అనంతరం కూడా ఎంపీలు నిరసన కొనసాగించారు. వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ ఎంపీలు విరామం లేకుండా ఉదయం నుంచి సాయంత్రం సభ వాయిదా పడేవరకు నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు.