జాతీయ వార్తలు

గెలిపిస్తే త్రిపురకు అద్భుత భవిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోనామురా (త్రిపుర), ఫిబ్రవరి 8: రానున్న ఎన్నికల్లో అభివృద్ధికి దోహదం చేసే బీజేపీకే పట్టం కట్టాలని త్రిపుర ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మాణిక్ సర్కార్ సారథ్యంలోని వామపక్ష ప్రభుత్వాన్ని సాగనంపాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే దిశగా ఓటర్లు తమ నిర్ణయం తీసుకోవాలని గురువారం నాడిక్కడి రంగామాటియా మదర్సా మైదానంలో జరిగిన భారీ ర్యాలీలో మోదీ అన్నారు. రాష్ట్రంలో దీర్ఘకాలంగా అధికారంలో ఉన్న మాణిక్ సర్కార్ ప్రభుత్వం రాష్ట్భ్రావృద్ధికి, ప్రజల అభ్యున్నతికి ఏమాత్రం దోహదం చేయలేకపోయిందని మోదీ ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజల స్థితిగతులు మారాలంటే అభివృద్ధే చుక్కానిగా త్రిపుర దేశంలోని ఇతర రాష్ట్రాలతోపాటు పోటీగా మందుకు సాగాలంటే ప్రస్తుత ప్రభుత్వాన్ని కూలదోసి బీజేపీకి పట్టం కట్టడం ఒక్కటే సముచిత నిర్ణయం అవుతుందని మోదీ తెలిపారు. ఈ సందర్భంగా హైవేలు, ఇంటర్‌నెట్, రహదార్లు, విమాన సర్వీసులు (హెచ్‌ఐఆర్‌ఏ) ఇబ్బడిముబ్బడిగా రాష్ట్రానికి రావాలంటే ప్రస్తుత ప్రభుత్వాన్ని మార్చి బీజేపీకి అధికారాన్ని అప్పగించడమే మార్గమని తెలిపారు. దీర్ఘకాలంగా త్రిపుర వెనుకబడిన రాష్ట్రంగానే మిగిలిపోయిందని, అభివృద్ధి అన్నది ఏ కోశానా రాష్ట్రంలో లేదని మోదీ అన్నారు. ఈ నేపథ్యంలో రవాణా సౌకర్యాలను విస్తృతంగా పెంపొందించడం ద్వారా రాష్ట్రంలో ప్రగతి దిశగా పరివర్తన తీసుకురావాలన్నదే బీజేపీ ఆశయమని మోదీ ఉద్ఘాటించారు. రాష్ట్రం అన్ని రంగాల్లోనూ ప్రగతిని సాధించాలంటే ప్రస్తుత సర్కార్ వల్ల ఏ రకమైన ఉపయోగం ఉండదన్న వాస్తవాన్ని ప్రజలు గుర్తించాలని అన్నారు. ఏ రాష్టమ్రైనా అభివృద్ధి చెందాలంటే సరైన రోడ్డు మార్గాలు, హైవేలు, రైలు సౌకర్యాలు, విమాన సౌకర్యాలు అన్ని విధాలుగా పెంపొందాల్సిన అవసరం ఉందని తెలిపారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈ నాలుగింటిని రాష్ట్రానికి తీసుకువస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. 60 స్థానాలు కలిగిన త్రిపుర అసెంబ్లీకి ఈ నెల 18న ఎన్నికలు జరుగుతాయి. మార్చి 3న ఫలితాలు వెలువడతాయి.

చిత్రాలు..త్రిపురలో గురువారం బీజేపీ నిర్వహించిన ఒక ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ.
సభకు హాజరైన జనం.