జాతీయ వార్తలు

మీవన్నీ డొల్ల ప్రకటనలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: డొల్ల ప్రకటనలతో ప్రజలను మోసం చేయలేరంటూ తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు, కేంద్ర సైన్స్, టెక్నాలజీ మంత్రి సుజనా చౌదరి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో వాదనకు దిగారు. పార్లమెంటు ఆవరణలోని తెలుగదేశం పార్లమెంటరీ పార్టీ కార్యాలయం వద్ద ఇరువురు మంత్రుల మధ్య ఈ వాగ్వివాదం చోటు చేసుకుంది. లోక్‌సభ గురువారం రాత్రి వాయిదా పడిన అనంతరం అరుణ్‌జైట్లీ బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయానికి వెళుతున్న సమయంలో పక్కనే ఉన్న తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ కార్యాలయం నుంచి సుజనా చౌదరి బయటకు వస్తున్నారు. ఇరువురు ఎదురుపడగానే జైట్లీ మాట్లాడుతూ ‘నేను విభజన హామీలపై లోక్‌సభలో రెండు ప్రకటనలు చేసినా మీరెందుకు సంతృప్తి చెందటం లేదు.ఎందుకు నిరసన వ్యక్తం చేస్తున్నారు?’అని ప్రశ్నించారు. దీనికి సుజనా చౌదరి బదులిస్తూ ‘మీరు డొల్ల ప్రకటనలతో ప్రజలను మోసం చేయలేరు’అంటూ మండిపడ్డారు. ఏవో ప్రకటనలు చేసేసి మోసం చేశారని సుజనాచౌదరి ఆరోపించటం పట్ల జైట్లీ కూడా ఆగ్రహం చెందారు. విమర్శలను ఎంత మాత్రం సహించని జైట్లీకి సుజనా చౌదరి ఆరోపణలు షాక్ ఇచ్చాయి.
సుజనా తన వాదన కొనసాగిస్తూ రాజకీయ పార్టీలు ఉంటాయి, పోతాయి కానీ ప్రజలు ఎల్లకాలం ఉంటారు, వారికి ఇచ్చిన వాగ్దానాలను నేరవేర్చటం మన బాధ్యత అని స్పష్టం చేశారు. ‘పార్టీలకు విలువ ఇవ్వాలి తప్ప నంబర్లకు కాదు’అని సుజనా చురకేశారు. అలాగని చౌదరి గట్టిగా మాట్లాడటంతో అరుణ్‌జైట్లీ మరింత అసహనం, అవమానానికి గురయినట్టు కనిపించింది.