జాతీయ వార్తలు

‘డిఫెన్స్ కారిడార్’ హైదరాబాద్‌లో పెట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర రక్షణ మంత్రి నిర్మాలా సీతారామన్‌కు ఐటీ మంత్రి కేటీ రామారావువిజ్ఞప్తి చేశారు. గురువారం నాడు తెలంగాణ పంచాయతిరాజ్, ఐటి శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నరేంద్రసింగ్ తోమర్, హర్షవర్ధన్, ధర్మేంద్ర ప్రధాన్‌లతో సమావేశమయ్యారు. కేటీఆర్ మాట్లాడుతూ 2018-19 ఏడాది బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం రెండు డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్‌లను ప్రకటించిందని గుర్తుచేశారు. వాటిలో ఒకటి హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కోరినట్టు తెలిపారు. రక్షణ శాఖకు సంబంధించిన పలు కీలకమైన సంస్థలు హైదరాబాద్‌లో ఉన్నాయని ఆయన అన్నారు. అలాగే ఫిక్కీ ఆధ్యర్యంలో ఈ నెల 14 నుంచి 19 వరకు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగే ప్రపంచ సదస్సు, ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్ తోమర్, హర్షవర్థన్‌లను ఆహ్వానించినట్టు ఆయన వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఫార్మాసిటీ అభివృద్ధికి సహకారం అందించాలని హర్షవర్థన్‌ను కోరామన్నారు. పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేద్రపధాన్‌ను కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించినట్టు తారకరామారావుస్పష్టం చేశారు. శుక్రవారాం రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌తో సమావేశం కానున్నట్టు కేటీఆర్ తెలిపారు.