జాతీయ వార్తలు

తాజ్‌పై విజన్ డాక్యుమెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ప్రపంచ వింతల్లో ఒకటైన చారిత్రక కట్టడం తాజ్‌మహల్ పరిరక్షణకు ఏం చర్యలు తీసుకున్నదీ సమగ్ర నివేది ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. తాజ్ ట్రెపిజియం జోన్(టీజెడ్)పేరుతో ప్రభుత్వం తీసుకున్న హడావుడి నిర్ణయాలను జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. టీటీజెడ్ పరిధిని 10,400 కిలోమీటర్లు విస్తరించడంతోపాటు హడావుడిగా కార్యక్రమాలు చేపట్టడంపై కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఆగ్రా, ఫిరోజాబాద్, మధుర, హత్రాస్, ఎటా, రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ను టీటీజెడ్ పరిధిలోకి తెచ్చారు. టీటీజడ్ పరిధిలో చర్మ పరిశ్రమలు, హోటళ్లు ఎందుకు అంత హడావుడిగా ఏర్పాటు చేస్తున్నారని బెంచ్ నిలదీసింది. యూపీ ప్రభుత్వం తరపున కోర్టుకు హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాపై బెంచ్ ప్రశ్నల వర్షం కురిపించింది. గతంలో అలాంటి కార్యకలాపాలు నిలిపివేసిన విషయాన్ని కోర్టు గుర్తుచేసింది.‘ఇప్పటికప్పుడు అంత హడావుడిగా కార్యక్రమాలు చేపట్టడానికి ఏమైనా ప్రత్యేక కారణం ఉందా?’అని న్యాయమూర్తులు ప్రశ్నించారు. 17వ శతాబ్దాంనాటి ప్రముఖ కట్టడం తాజ్‌మహాల్ పరిరక్షణకు ఏం చర్యలు తీసుకుంటున్నదీ విజన్ డాక్యుమెంట్ అందజేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. నాలుగువారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని బెంచ్ స్పష్టం చేసింది.