జాతీయ వార్తలు

గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంధీనగర్, ఫిబ్రవరి 19:గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో 75 స్థానాలకు గాను అధికార బీజేపీ 47 స్థానాల్లో గెలుపొంది తన ఆధిక్యతను నిలుపుకుంది. అయితే గత ఎన్నికల్లో సాధించిన స్థానాలతో పోలిస్తే పనె్నండు మున్సిపాల్టీలను కోల్పోయింది. గత ఎన్నికల్లో 59 స్థానాల్లో బీజేపీ గెలిచింది. మరోవైపు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలను సాధించింది. మొత్త 16 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసిన కాంగ్రెస్ గత ఎన్నికల్లో కేవలం 11 స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఇప్పుడు మరో ఐదు స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన నలుగురు ఇండిపెండ్లతో కలిపితే ఆ పార్టీ నెగ్గిన స్థానాల సంఖ్య 20గా కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. కాగా ఆరు మున్సిపాల్టీలలో ఓటర్లు ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని ఇవ్వలేదు. గుజరాత్ శాసనసభకు రెండు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో అధికారం నిలుపుకున్నా పేలవమైన ప్రదర్శన చూపిన కమలదళం మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే తీరులో ఫలితాలు సాధించింది. అయితే వద్‌నగర్ మున్సిపాల్టీలో 28 వార్డుల్లో పోటీ చేసిన బీజేపీ 27చోట్ల నెగ్గడం బీజేపీకి ఆనందం కలిగించే పరిణామం. మోదీ సొంత పట్టణమైన వద్‌నగర్‌లో బీజేపీ ఓడిపోయిన ఆ ఒక్క వార్డులో కాంగ్రెస్ నెగ్గింది. గత శాసనసభ ఎన్నికల్లో వద్‌నగర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ ఓడిపోయింది.