జాతీయ వార్తలు

పీఎన్బీపై నోరు విప్పరేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ములావాద్ (కర్నాటక), ఫిబ్రవరి 25: దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం విషయంలో దేశానికి కాపలాదారు అని చెప్పుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు వౌనం వహిస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్వరంతో ప్రశ్నించారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు అజయ్ షాకు చెందిన ఒక కంపెనీ టర్నోవర్ ఆకస్మికంగా పెరిగిందంటూ కథనాలు వచ్చినప్పటికీ మోదీ ఎలాంటి చర్యా తీసుకోలేదని రాహుల్ ధ్వజమెత్తారు. కర్నాటకలో పర్యటించిన మోదీ తాను ప్రధానిగా కాకుండా దేశానికి కాపాలాదారుగా పరిగణించాలని ప్రజలను కోరారని గుర్తు చేసిన రాహుల్, ఇన్ని కుంభకోణాలు జరుగుతున్నా ఎందుకు నోరు మెదపడం లేదని గట్టిగా ప్రశ్నించారు. ఆదివారం ఇక్కడ జరిగిన ఓ ర్యాలీలో మాట్లాడిన రాహుల్, గతంలో రాష్ట్రంలో ఆ పార్టీకి చెందిన ఓ ముఖ్యమంత్రి, మరో నలుగురు మంత్రులు జైలుకెళ్లారని, వారిమధ్యే కూర్చుని నరేంద్ర మోదీ అవినీతి గురించి మాట్లాడటం, తాను దేశానికి చౌకీదారునని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అమిత్ షా కుమారుడి కంపెనీ టర్నోవర్ 50వేల రూపాయల నుంచి కేవలం మూడు నెలల వ్యవధిలో 80 కోట్ల రూపాయలకు పెరిగిందని, అంత జరిగినా కూడా నరేంద్ర మోదీ నోరు మెదపలేదని రాహుల్ విరుచుకుపడ్డారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఉత్తర కర్నాటక ప్రాంతాల్లో పర్యటిస్తున్న రాహుల్, గత పక్షం రోజుల్లో రాష్ట్రానికి రావడం ఇది రెండోసారి. మరికొన్ని నెలల్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ అగ్రనాయకత్వం అత్యంత వ్యూహాత్మక రీతిలో రాష్ట్రంలో పర్యటనలు చేపట్టాయి. పెద్దనోట్ల రద్దు సమయంలో సామాన్య ప్రజలంతా బ్యాంకుల ముందు క్యూలుగట్టిగా సూటూబూటూ వేసుకున్న ఏ వ్యక్తీకూడా కనీసం బ్యాంకు వద్దకు రాలేదని రాహుల్ అన్నారు. నరేంద్ర మోదీ సాయంతో దేశంలోని సంపన్నులు అందరూ నల్లధనాన్ని వైట్‌మనీగా మార్చుకున్నారని రాహుల్ ఆరోపించారు. అలాగే, పంజాబ్ నేషనల్ బ్యాంకు విషయంలో కూడా మోదీ ఇంతవరకూ ఎలాంటి ప్రకటనా చేయకపోవడం చౌకీదారు ఉండగానే ఆ కుంభకోణ సూత్రధారి నీరవ్‌మోదీ దేశాన్ని వదిలి పారిపోవడం విస్మయాన్ని కలిగిస్తుందన్నారు.

చిత్రాలు..కర్నాటకలోని జామ్‌ఖండీలో ఆదివారం నిర్వహించిన కాంగ్రెస్ ర్యాలీకి భారీగా తరలివచ్చిన జనం.
*అభివాదం చేస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్