జాతీయ వార్తలు

24న జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 08 రాకెట్ ప్రయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, మార్చి 1: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కమ్యూనికేషన్ ఉపగ్రహ ప్రయోగానికి సన్నద్ధమైంది. ఈ నెల 24న నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) కేంద్రం నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 8 రాకెట్ ప్రయోగం చేపట్టనుంది. ఈ రాకెట్ ద్వారా రోదసీలోకి పంపే జీశాట్-6ఎ ఉపగ్రహం బెంగళూరులోని ఉపగ్రహ తయారీ కేంద్రం నుంచి రోడ్డు మార్గాన అత్యంత భారీ భద్రత నడుమ గురువారం ప్రత్యేక వాహనంలో షార్ కేంద్రానికి తీసుకొచ్చారు. ఇప్పటికే షార్‌లోని రెండో ప్రయోగ వేదిక రాకెట్ మూడు దశల అనుసంధాన పనులను శాస్తవ్రేత్తలు పూర్తిచేశారు. 2,140కిలోల బరువు గల జీశాట్-6ఎ ఉపగ్రహం సమాచార రంగానికి చెందింది. దేశంలో కమ్యూనికేషన్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇస్రో ఈ ఉపగ్రహ ప్రయోగం చేపడుతోంది. ఇది విజయవంతమైతే పదేళ్ల పాటు సేవలు అందించనుంది. శుక్రవారం ఉపగ్రహాన్ని క్లీన్ రూమ్‌లో పెట్టి శాస్తవ్రేత్తలు పలు పరీక్షలు నిర్వహించనున్నారు. వివిధ పరీక్షలనంతరం ఉపగ్రహాన్ని రాకెట్ శిఖర భాగాన అమర్చి ప్రయోగానికి సిద్ధం చేస్తారు. అన్ని సజావుగా సాగి వాతావరణం అనుకూలిస్తే మార్చి 24న జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 08 రాకెట్ నింగిలోకి ఎగరనుంది.
మరో వైపు మొదటి ప్రయోగ వేదిక వద్ద పీఎస్‌ఎల్‌వీ-సి 41 రాకెట్ అనుసంధాన పనులు కూడా పూర్తికావచ్చాయి. ఈ రాకెట్ ప్రయోగం కూడా మార్చి చివరిలో జరిపేందుకు శాస్తవ్రేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ రాకెట్ ద్వారా భారత క్షేత్రీయ దిక్సూచి వ్యవస్థకు సంబంధించి (ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం) ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపనున్నారు. ఈ రాకెట్ కూడా బెంగళూరు ఉపగ్రహ తయారీ కేంద్రంలో రూపొందిస్తున్నారు. మరో వారంలో ఈ ఉపగ్రహం కూడా షార్‌కు చేరుకోనుంది. ఇదిలా ఉండగా మార్చి 5న జిఎస్‌ఎల్‌వి-ఎఫ్ 8 రాకెట్‌ను వెహికల్ అస్లెంబింగ్ బిల్డింగ్ (వ్యాబ్) నుంచి ఊంబ్లికల్ టవర్ మీదకు తరలించిన వెంటనే వ్యాబ్‌లో జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 10 రాకెట్ అనుసంధాన పనులను ప్రారంభించేందుకు శాస్తవ్రేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 10 రాకెట్ ద్వారా చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపేందుకు సమాయత్తమవుతున్నారు. ఏప్రిల్ మూడో వారంలో చంద్రయాన్-2 ఉపగ్రహం ప్రయోగం జరగనున్నట్లు సమాచారం. వరుసగా మూడు ప్రయోగాలు ఉండడంతో షార్‌లో సందడి వాతావరణం నెలకొనింది.

చిత్రం..భారీ భద్రత నడుమ ప్రత్యేక వాహనంలో షార్‌కు చేరుకున్న జీశాట్-6ఎ ఉపగ్రహం