జాతీయ వార్తలు

ఆ రెండూ వామపక్ష భావజాల ఉద్యమాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 27: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ, ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు)లలో జరిగిన సంఘటనలు రెండూ కూడా ప్రధానంగా వామపక్ష భావజాల ఉద్యమాలేనని, వీటిలో కొద్ది మంది జిహాదీలు కూడా ఉన్నారని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అంటున్నారు. జెఎన్‌యు విషయంలో ఆందోళనలో పాలు పంచుకున్న వారిలో అధిక శాతం వామక్ష తీవ్రవాద భావజాలమున్న వారే ఉన్నారని, కొద్దిమంది మాత్రమే జిహాదీలున్నారని, గత ఫిబ్రవరి 9న క్యాంపస్‌లో జరిగిన ప్రదర్శన సందర్భంగా ముఖాలకు బట్టలు కట్టుకుని దేశ వ్యతిరేక నినాదాలు చేసిన వారే ఆ జిహాదీలని జైట్లీ అన్నారు. ఇక హెచ్‌సియు విషయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును అనవసరంగా లాగారని పిటిఐ వార్తాసంస్థకు చెందిన జర్నలిస్టులతో ఆదివారం ముచ్చటిస్తూ జైట్లీ అన్నారు. అయితే ఈ రెండు యూనివర్శిటీల్లో జరిగిన సంఘటనలతో మొదలైన చర్చలో దేశంలోని మతపరమైన, లేదా మైనార్టీ వర్గాలు పాలు పంచుకోకపోవడంపై జైట్లీ సంతృప్తి వ్యక్తం చేశారు. వామపక్ష భావజాల ఉద్యమాలయిన వీటిలో వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలు అనవసరంగా ఇరుక్కున్నారని మంత్రి అంటూ, అందువల్లనే బిజెపి దీన్ని సైద్ధాంతికపరమైన సవాలుగా తీసుకుందని చెప్పారు. ‘ప్రతి ఒక్కరు కూడా మేము తీసుకున్న వైఖరికి దగ్గరగా రావడాన్ని బట్టి బిజెపి ఈ సైద్ధాంతిక చర్చ తొలి రౌండ్‌లో విజయం సాధించిందని నేను అనుకుంటున్నా’ అని జైట్లీ అన్నారు. ఈ చర్చలో మరిన్ని రౌండ్లు ఉంటాయా అని అడగ్గా, ఇది తమ పార్టీ ప్రారంభించిన యుద్ధం కాదని ఆయన చెప్పారు. ‘ మేము చర్చను ఈ స్థాయి దాకా తీసుకు రాలేదు. అయితే ఎవరైనా మరోసారి మొత్తం అంశాన్ని తిరిగి ప్రారంభిస్తే అప్పుడు మళ్లీ చర్చ కొనసాగి తీరుతుంది’ అని ఆర్థిక మంత్రి చెప్పారు. జాతీయతా వాదంపై చర్చను లేవనెత్తడం ద్వారా బిజెపి రాజకీయ ప్రయోజనాలు పొందుతోందా అని అడగ్గా, ‘ నేను ప్రయోజనాలకోసం చూడడం లేదు. ఇది ఒక సైద్ధాంతికపరమైన వైఖరి. మేము మా వైఖరిని స్పష్టం చేశాం. ఈ యుద్ధంలో మేము ఓడిపోమని నేను అనుకుంటున్నాను’ అని జైట్లీ చెప్పారు. ప్రభుత్వ అభివృద్ధి అజెండాకు, జాతీయతా వాదంపై చర్చకు మధ్య వైరుధ్యం ఏదీ లేదని పిటిఐ ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన చెప్పారు. ‘ఈ చర్చ ఆసక్తికరంగా అనిపించని ఓ వర్గం ఈ దేశంలో ఉంది. అది చాలా చిన్న వర్గమే కావచ్చు. అందుకే వాళ్లు సమస్యను పక్కదారి పట్టించాలనుకున్నారు’ అని ఆయన అన్నారు. ‘ఈ దేశంలో భారత్ మాతాకీ జై నినాదం చేయడం తప్పనిసరి కాదు. అయితే దీనికి నేను అభ్యంతరం చెప్తున్నాను, ఆ నినాదం చేయనని ఎవరైనా అన్నప్పుడు మాత్రమే అది ఒక చర్చనీయాంశం అయింది’ అని మజ్లిస్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ చేసిన ప్రకటనను పరోక్షంగా ప్రస్తావిస్తూ జైట్లీ చెప్పారు.