జాతీయ వార్తలు

మా డిమాండ్లకోసమే ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 20: బీజేపీ సూచన మేరకే టీఆర్‌ఎస్ ఎంపీలు లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా చేస్తున్నారంటూ తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు చేసిన ఆరోపణలను లోక్‌సభలో పార్టీ పక్షం ఉపనాయకుడు బి.వినోద్‌కుమార్ ఖండించారు. వెనుకబడిన కులాలు, ఎస్సీ, ఎస్టీలను రాజ్యాంగంలోని 9వ షెడ్యూలులో చేర్చాలన్నది తమ డిమాండ్, ఈ లక్ష్య సాధనకోసమే తాము పార్లమెంటులో పోరాడుతున్నామని వినోద్‌కుమార్ స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ సభ్యులు తెలంగాణలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు పోరాడుతుంటే బీజేపీ సలహా మేరకు తాము పోడియం వద్దకు వచ్చి గొడవ చేస్తున్నామని టీడీపీ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ సభ్యుడు వరప్రసాదరావు ఆరోపించటం సిగ్గుచేటని ఆయన దుయ్యబట్టారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వటం లేదని ఇతర పార్టీలపై ఆరోపణలు చేయటం తగదని ఆయన అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల కోసం తాము మొదటినుంచీ పోరాడుతుంటే తెలుగుదేశం ఇటీవల కళ్లు తెరిచి ప్రత్యేక హోదాకోసం పోరాటం ప్రారంభించిందని వినోద్‌కుమార్ దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై తెలుగుదేశం ఎంపీలు అసంబద్ధ, అర్థరహిత ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు, దీనిని ఎంత మాత్రం సహించమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన అశాస్ర్తియంగా జరిగిందని అశోక్ గజపతిరాజు ఆరోపిస్తే, సుజనా చౌదరి రాష్ట్ర విభజన చట్టంపై విమర్శలు గుప్పించారని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకోసం జరిగిన పోరాటాన్ని ఈ విమర్శలు అవమానానికి గురిచేస్తున్నాయని వినోద్‌కుమార్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ డిమాండ్లను తాము సమర్థిస్తుంటే తెలుగుదేశం ఎంపీలు మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

చిత్రం..రిజర్వేషన్ల వ్యవహారంపై పార్లమెంటు భవన్ వద్ద నినాదాలిస్తున్న టీఆర్‌ఎస్ ఎంపీలు