జాతీయ వార్తలు

ఆధార్‌పై పీపీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 21: ఆథార్‌పై నెలకొన్న అనుమానాల నివృత్తికి యూనిక్ ఐడింటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) సీఈవోతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు అనుమతి ఇవ్వాలని సుప్రీం కోర్టును కేంద్ర అభ్యర్థించింది. న్యాయస్థానం లేదా సంస్థలకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పిస్తామని కేంద్రం బుధవారం ఇక్కడ స్పష్టం చేసింది. ఆథార్ పథకానికి ఉన్న చట్టబద్ధతను ప్రశ్నిస్తూ దాఖలైన పలు పిటీషన్లను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్‌మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనంతో చర్చించిన తరవాత తేదీని నిర్ణయిస్తామని చీఫ్ జస్టిస్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఆధార్ డేటా, పర్యవేక్షణ, గోప్యతకు సంబంధించి అనేక సాంకేతిక అంశాలు ఇందులో ఉన్నాయని బెంచ్ స్పష్టం చేసింది. ఆధార్ నెంబర్ అనుసంధానం చేయకపోతే లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందవన్న నిబంధన పక్కన పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. కాగా కేంద్ర తరుఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తన వాదన వినిపించారు. యూనిక్ ఐడీ సీఈవో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సాంకేతిక అంశాలపై మరింత స్పష్టత వస్తుందని కోర్టుకు తెలిపారు.