జాతీయ వార్తలు

సుప్రీం తీర్పును పునఃసమీక్షించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 21: బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే పాలనలో దేశంలో దళితులపై అత్యాచారాలు పెరుగుతున్న సమయంలో, ఎస్సీ ఎస్టీ అత్యాచార కేసులపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు దోషులు తప్పించుకునేదిలా ఉందని కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. సాక్ష్యాధారాలను పక్కదోవ పట్టించి దోషులు తక్షణ అరెస్ట్‌ల నుంచి తప్పించుకోడానికి అవకాశం కల్పించేదిగా సుప్రీం తీర్పు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. అత్యాచార కేసుల విషయంలో మంగళవారం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై పునఃస్సమీక్ష జరగాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ మాట్లాడుతూ ‘సుప్రీం తీర్పు దళితుల్లో మరింత అభద్రతాభావం పెంచేదిలా ఉంది’ వ్యాఖ్యానించారు. ‘సుప్రీం కోర్టు మంగళవారం ప్రకటించిన నిర్ణయాన్ని తీవ్రంగానే ఆలోచించాలి. తీర్పుపై పునఃస్సమీక్ష జరగకుంటే, నిజంగా దురదృష్టకర పరిణామమే. సుప్రీం నిర్ణయంతో ఎస్సీ, ఎస్టీలు ఇతర బాధిత వర్గాలు అభద్రతా భావానికి గురవుతున్నారు. జాతీయ ఆసక్తులను దృష్టిలో పెట్టుకుని సుప్రీం నిర్ణయంపై పునఃస్సమీక్ష జరగాలని భావిస్తున్నాం’ అని శర్మ వ్యాఖ్యానించారు. సున్నితమైన ఈ అంశంపై కేంద్రం ఎందుకు వౌనం వహిస్తోంది అని ప్రశ్నించారు.
సుప్రీం ఎదుట అటార్నీ జనరల్ ద్వారా కేంద్రం తన వాదన వినిపించాలని, తీర్పుపై స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించాలని శర్మ డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్రం వౌనం వహిస్తే, సుప్రీం నిర్ణయానికి వత్తాసు పలికినట్టేనని అన్నారు. కాంగ్రెస్ ఎంపీ కుమారి సెల్జా ఈ అంశంపై స్పందిస్తూ ‘రిజర్వేషన్ల ఉనికిని దెబ్బతీసేందుకు బీజేపీ-ఆరెస్సెస్ చేస్తున్న కుట్ర’ అన్నారు. లోక్‌సభలో కాంగ్రెస్ చీఫ్ విప్ జ్యోతిరాధిత్య సింథియా మాట్లాడుతూ ‘ఈ అంశంపై ప్రధాని లేదా కేంద్ర మంత్రి ఎవరూ ఇంతవరకూ స్పష్టత ఇవ్వలేదు. రిజర్వేషన్లు ఉండటం బీజేపీ-ఆరెస్సెలకు ఇష్టం లేదు’ అన్నారు.
ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వాధికారులను బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్టు అనేక సందర్భాల్లో తమ దృష్టికి వచ్చిందని అభిప్రాయపడిన సుప్రీం కోర్టు, అభియోగాలు ఎదుర్కొంటున్న వారి తక్షణ అరెస్ట్‌కు సంబంధించి కొంత తీవ్రతను తగ్గించడం తెలిసిందే. ఇలాంటి కేసుల్లో తక్షణ అరెస్ట్‌లకు సంబంధించి కొన్ని నిబంధనలను సరళతరం చేస్తూ తీర్పు నివ్వడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది.