జాతీయ వార్తలు

మరో నేవిగేషన్ ప్రయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో రెండు ప్రయోగాలకు సన్నద్ధమైంది. ఈ నెల 29న నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 8 రాకెట్ ప్రయోగం జరగనుంది. ఈ ప్రయోగానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ శాస్తవ్రేత్తలు పూర్తిచేశారు. షార్‌లోని రెండో ప్రయోగవేదిక నుండి రాకెట్ ద్వారా జీశాట్ 6ఎ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. అదే విధంగా ఏప్రిల్ 12న పీఎస్‌ఎల్‌వి-సి41
ప్రయోగం జరిపేందుకు శాస్తవ్రేత్తలు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ రాకెట్ ద్వారా రోదసీలోకి పంపే నావిగేషన్ ఉపగ్రహం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ ఉపగ్రహం గురువారం బెంగళూరు ఉపగ్రహ తయారీ కేంద్రం నుండి అత్యంత భారీ భద్రత నడుమ షార్ కేంద్రానికి తీసుకొచ్చారు. ఈ ఉపగ్రహాన్ని శుక్రవారం ఉపగ్రహ క్లీన్ రూమ్‌లో వివిధ పరీక్షలు నిర్వహించిన అనంతరం రాకెట్ శిఖర భాగాన అమర్చనున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించి మొదటి ప్రయోగవేదిక వద్ద రాకెట్ మూడు దశల అనుసంధాన పనులను శాస్తవ్రేత్తలు పూర్తి చేశారు. సోమవారం నుండి నాలుగో దశ పనులు ప్రారంభించి ఉపగ్రహం అమర్చే ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ సిరీస్‌కు సంబంధించిన ఏడు ఉపగ్రహాలను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఇందులో ఒక ఉపగ్రహం సంకేతాలు సరిగ్గా అందకపోవడంతో దాని స్థానంలో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ 8వ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపించేందుకు ఇస్రో శ్రీకారం చుట్టింది. రెండు ప్రయోగాలు ఇస్రో చేపట్టనుండటంతో షార్‌లో సందడి వాతావరణం నెలకొంది.

చిత్రం..భారీ భద్రత నడుమ బెంగళూరు ఇస్రో సెంటర్ నుంచి షార్‌కు చేరుకున్న ఉపగ్రహం