జాతీయ వార్తలు

గొల్ల కురుమలను అర్ధసంచారుల జాబితాలో చేర్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 22: తెలంగాణలోని గొల్ల కురుమలను అర్ధసంచార జాతుల జాబితాలో చేర్పించే విషయాన్ని సానుభూతితో పరిశీలిస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ అహిర్, కేంద్ర పట్టణాభివృద్ది శాఖ సహాయ మంత్రి రాంక్రిపాల్ యాదవ్, కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి హుకుందేవ్ నారాయణ్ యాదవ్ గొల్ల కురుమ నవ నిర్మాణ సమితి నాయకులకు హామీ ఇచ్చారు. సమితి రాష్ట్ర అధ్యక్షుడు దాసరి నగేష్ యాదవ్, కార్యదర్శి బి.వెంకట్ యాదవ్, యువజన అధ్యక్షుడు సిద్ది రమేష్ యాదవ్ తదితరులు గురువారం ముగ్గురు మంత్రులను కలిసి గొల్ల కురుమల సమస్యల గురించి వివరించారు. 1955 నుండి 1971 వరకు గొల్ల కురుమలకు అర్ధసంచార జాతుల రిజర్వేషన్లను అమలు చేశారనీ, అయితే ఆ తరువాత ఎలాంటి కారణం చూపించకుండా వీటిని నిలిపివేశారని మంత్రులకు వివరించారు. తెలంగాణలోని గొల్ల కురుమలు ఇప్పటికీ ఎంతో వెనుకబడి ఉన్నారనీ, అర్ధసంచార జాతులుగా గుర్తించటం ద్వారా వీరి అభివృద్ధికి తోడ్పడాలని సమితి నాయకులు కేంద్ర మంత్రులను కోరారు. గొల్ల కురుమలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు పరిష్కారం కావాలంటే వారికి అర్ధసంచార జాతుల రిజర్వేషన్లను పునరుద్ధరించాలని, దీనికోసం మంత్రులు కేంద్రస్థాయిలో కృషిచేయాలని దాసరి నగేష్ యాదవ్ వారికి సూచించారు. గొల్ల కురుమలకు అర్ధసంచార జాతుల రిజర్వేషన్ల పునరుద్ధరణ కోసం గత నెలలో సరూర్‌నగర్‌లో స్టేడియంలో బహిరంగ సభ ఏర్పాటు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గొల్ల కురుమలను అణిచివేసేందుకు ప్రయత్నిస్తోందని ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తామని ముగ్గురు మంత్రులు హామీ ఇచ్చినట్లు నగేష్ యాదవ్ తెలిపారు.