జాతీయ వార్తలు

విమానంలో ‘వెజ్’ గొడవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 23: విమానంలో ప్రయాణికునికి వెజిటేరియన్ మీల్స్ బదులు నాన్‌వెజ్ సరఫరా చేసిందన్న ఆగ్రహంతో కింది స్థాయి ఉద్యోగిపై సూపర్‌వైజర్ చేయిచేసుకున్నాడు. ఈనెల 17న న్యూఢిల్లీ నుంచి ఫ్రాంక్‌ఫర్ట్ వెళ్తున్న విమానంలో చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపుతోంది. దీనిపై విమానయాన సంస్థ అంతర్గత విచారణకు ఆదేశించింది. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎయిర్ ఇండియా విమానం ఫ్రాక్‌ఫర్ట్ వెళ్తోంది. కేబినెట్ అటెండర్ ఓ ప్రయాణికుడికి వెజ్ బదులు నాన్‌వెజ్ ఫుడ్ సరఫరా చేసింది. దీనిపై ప్రయాణికుడు కేబిన్ సూపర్‌వైజర్ దృష్టికి తీసుకెళ్లాడు. బిజినెస్ క్లాస్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఆయన ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. తప్పుతెలుసుకున్న అటెండర్ ప్రయాణికుడి వద్దకు వెళ్లి క్షమాపణ చెప్పడంతోపాటు వెజ్‌ఫుడ్ సరఫరా చేసిందని ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి వెల్లడించారు. అయితే కేబిన్ సూపర్‌వైజర్ అతిగా పోయాడు. అటెండర్‌ను పిలిచి గొడవ చేయడంతోపాటు చేయిచేసుకున్నాడు. అయితే సూపర్ వైజర్ చర్యను ప్రతిఘటించకుండా పై అధికారులకు ఫిర్యాదు చేసింది. న్యూఢిల్లీ-ఫ్రాంక్‌ఫర్ట్ ఏ1 121 విమానంలో జరిగిన సంఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు అధికార ప్రతినిధి వెల్లడించారు. ఇటీవల విమాన సిబ్బంది ప్రయాణికుల పట్ల అమర్యాద ప్రవర్తన, అహంకారంగా వ్యవహరిస్తున్న సంఘటనలు వార్తల్లోకి ఎక్కాయి. ఇండిగో విమానంలోని గ్రౌండ్ స్ట్ఫా ఓ ప్రయాణికుణ్ని తరిమితరిమి కొట్టిన సంఘటన ఆ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయింది. విమానంలో సీటు విషయమై గొవడకు దిగిన శివసేన ఎంపీ ఉదంతం దేశ వ్యాప్తంగా కలలమే రేపింది. ఈ నేపథ్యంలో తాజా సంఘటనను ఎయిర్ ఇండియా యాజమాన్యం తీవ్రంగానే పరిగణిస్తోంది.