జాతీయ వార్తలు

సోనియా ఇఫ్తార్ రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 23: ఈ సంవత్సరం ఇఫ్తార్ విందును ఇవ్వరాదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నిర్ణయించారు. సాధారణంగా సంప్రదాయపరమైన వేడుకలా కాకుండా రాజకీయ వేదికగా మారే ఇఫ్తార్ విందును కాంగ్రెస్ ఈసారి రద్దు చేసుకోవటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. సాధారణంగా ప్రతి సంవత్సరం రాజధానిలోని అశోకా హోటల్‌లో ఇఫ్తార్ విందు ఇవ్వటం సోనియా సంప్రదాయంగా పాటిస్తూ వస్తున్నారు. పాకిస్తాన్ హైకమిషన్ ఇచ్చే ఇఫ్తార్ విందుతో పాటు అశోకా హోటల్‌లో కాంగ్రెస్ ఇచ్చే విందు ఢిల్లీలో అతి పెద్ద ఇఫ్తార్ పార్టీలుగా చెప్పుకుంటారు. అలాంటిది అనూహ్యంగా ఇఫ్తార్‌ను రద్దు చేసుకోవటం పార్టీ వర్గాల్లోనే ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తోంది.
ఓ పక్క పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ త్వరలో పగ్గాలు చేపట్టబోతున్నారన్న వార్తల నేపథ్యంలో ఆయన లేకుండా ఇఫ్తార్ విందు ఇవ్వటం సరికాద న్న ఆలోచనతో రద్దు చేసుకున్నట్లు పార్టీ హైకమాండ్ భావించటం పార్టీ కేడర్‌కు అ యోమయ సంకేతాలను పంపించింది. మరో పక్క వస్తు సేవల పన్ను విషయం లో కాంగ్రెస్ పూర్తిగా ఒంటరి అవుతోంది. నిరుడు కాంగ్రెస్‌తో సానుకూలంగా ఇఫ్తార్‌లో ఒకే టేబుల్ పంచుకున్న టియంసి, జెడియులు ఈసారి మెజార్టీ పార్టీలతో కలిసి జియస్‌టికి ఓకే అన్నాయి. దీంతో కాంగ్రెస్ పరిస్థితి ఇరకాటంలో పడింది.