జాతీయ వార్తలు

సోనియాకు స్వల్ప అస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిమ్లా, మార్చి 23: యుపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ స్వల్ప అస్వస్థతకు గురవ్వడంతో హుటాహుటీని రాజధాని ఢిల్లీకి తరలించారు. ఛారాబ్రాలో నిర్మాణంలో ఉన్న ఇం టిని చూసేందుకు సోనియా వచ్చారు. గురువారం అర్ధ రాత్రి సమయంలో 71 ఏళ్ల సోనియాకు నలతగా ఉందని సమాచారమిచ్చారు. వెంటనే తల్లిని వెంటబెట్టుకుని ప్రి యాంక గాంధీ ఢిల్లీ బయల్దేరారు. ఈమేరకు ఇందిరాగాం ధీ మెడికల్ కాలేజీ ఆసుపత్రి సీనియర్ సూపరింటెండెంట్ డా. రమేశ్‌చంద్ అప్రమత్తమయ్యారు. కాంగ్రెస్ మాజీ అ ధ్యక్షురాలి కోసం వైద్యులతో పాటు అంబులెన్స్‌ను ఇక్కడకు పంపారు. ఆలోపే సోనియా సొంత కారులో ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. యూపీఏ చైర్‌పర్సన్ కారును అంబులెన్స్ ఢిల్లీ వరకూ అనుసరించింది. కాగా ఢిల్లీ మార్గంలో పంచకుల వద్ద ఆమె వాహనాన్ని కాసేపు ఆపారు. చండీగఢ్ వరకూ డాక్టర్ రమేశ్ చంద్ ఆమె వెంటే వచ్చారు. వి శ్రాంతి లేకపోవడం వల్ల ఇలా జరిగిందని, ప్రస్తుతం సోని యా ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్ రమేశ్ వెల్లడించారు.